Suddala Ashok Teja : నా కొడుకే నాకు మళ్ళీ జన్మనిచ్చాడు..

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా.. లాంటి రెండు అద్భుతమైన పాటలు..............

Suddala

Suddala Ashok Teja :  ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా.. లాంటి రెండు అద్భుతమైన పాటలు రాశారు. తాజాగా ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలని తెలియచేశారు.

Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..

ఆయనకి రెండేళ్ల క్రితం లివర్‌ ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ జరిగింది. దాని గురించి మాట్లాడుతూ.. ”జన్మనిచ్చిన పుత్రుడే తిరిగి నాకు జన్మనివ్వడం అనేది నా అదృష్టం. ఇది నా జీవితంలో ఊహించని ఒక సంఘటన. నేను లివర్ ప్రాబ్లమ్ తో బాధపడ్డాను. నాకు లివర్‌ ప్లాంటేషన్‌ చేయాలి, లేకపోతే బతకను అని డాక్టర్లు చెప్పారు. చాలా మందికి లివర్ ప్లాంటేషన్ కి ఎవరూ ముందుకు రాక చనిపోయిన వారున్నారు. నా విషయంలో అది జరగలేదు. నా కూతురు, నా కొడుకులు నాకు లివర్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే వయసులో చిన్నోడు అవడంతో అర్జున్‌ తేజని డాక్టర్లు సెలక్ట్‌ చేసుకున్నారు. ఈ మే 23కి ఆపరేషన్‌ జరిగి రెండేళ్లు అవుతుంది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నా కొడుకే నాకు తండ్రి అయి మళ్ళీ జన్మనిచ్చాడు. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చూస్తూ ఉంటాం కానీ నా లైఫ్‌లో జరిగింది” అని తెలిపారు.