Ambajipeta Marriage Band : సుహాస్ కొత్త మూవీ టీజర్ చూశారా.. ఈసారి రూరల్ యాక్షన్‌తో..

సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.

Suhas new movie Ambajipeta Marriage Band teaser released

Ambajipeta Marriage Band : ఒక పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క హీరోగా కూడా వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. దీంతో ఇటీవల హీరోగా ఏకంగా ఆరు సినిమాలు అనౌన్స్ చేశాడు. వాటిలో ఒకటే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. మూవీ టైటిల్ అండ్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ చూసి.. ఇది కూడా ఒక కామెడీ అండ్ ఎమోషన్ తో తెరకెక్కుతోందని అనుకున్నారు.

అయితే ఈ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. లవ్ స్టోరీతో స్టార్ట్ అయిన టీజర్‌లో.. ఆడపిల్లల పుడితే భారం అనుకునే అంశాన్ని, అలాగే జాతిభేదం అంశాలను కూడా చూపించారు. ఇక మునపటి సినిమాల్లో సాఫ్ట్ గా ఒక ఫ్యామిలీ హీరోగా కనిపించిన సుహాస్.. ఈ మూవీలో రూరల్ యాక్షన్ సీన్స్ తో తనలోని మాస్ ని బయట పెట్టబోతున్నాడు. మొత్తానికి టీజర్ అయితే ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మరి ఆ టీజర్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Also read : Ram Charan : విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ క్యామియో ఉందా..? మహేష్ బాబు ఏం చెప్పాడు..?

ఈ చిత్రాన్ని దుశ్యంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ధీరజ్ నిర్మిస్తున్న ఈ సినిమాని బన్నీ వాస్, దర్శకుడు వెంకటేష్ మహా ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. శివాని హీరోయిన్ గా నటిస్తుంది. ఫిదా ఫేమ్ శరణ్య ఒక ప్రధాన పాత్ర చేస్తుంది. ఇక సుహాస్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రసన్న వదనం, ఆనందరావు అడ్వాంచర్స్, కేబుల్ రెడ్డి, గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.