Suhas : ఆ ఒక్క సీన్ కోసం..రెండుసార్లు ఆ సాహసం చేసిన సుహాస్..

ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న సుహాస్.. ఆ ఒక్క సీన్ కోసం రెండుసార్లు ఆ సాహసం చేశారట.

Suhas took dashing decision for one scene in Ambajipeta Marriage Band Movie

Suhas : తెలుగు యువ నటుడు సుహాస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. సుహాస్ నటించిన కొత్త సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. హీరోగా సుహాస్ కి ఇది మూడో సినిమా.. మొదటి రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో కూడా హిట్ కొట్టి.. హ్యాట్రిక్ ని అందుకోవాలని చూస్తున్నారు.

దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. డబ్బు, కులం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీలోని ఓ సీన్ లో సుహాస్.. గుండు గీయించుకొని కనిపిస్తాడు. ట్రైలర్ లో కూడా ఈ సీన్ చూపించారు. ఆ సీన్ కోసం సుహాస్.. నిజంగా గుండు గీయించుకున్నారట. అది కూడా ఒకసారి కాదు, షూటింగ్ గ్యాప్ వల్ల రెండుసార్లు గుండు గీయించుకోవాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు.

Also read : Ambajipeta Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రివ్యూ.. బ్యాండ్ మేళం సౌండ్ గట్టిగానే వినిపిస్తుంది..

ప్రస్తుతం ఈ నటుడు.. కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆరిస్టుగా, విలన్‌గా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో ఫుక్ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమా కోసం గుండు గీయించుకోవడం అంటే సాహసమే అని చెప్పాలి. ఒక సినిమా కోసం గుండు గీయించుకుంటే.. మరో సినిమాకి ఇబ్బంది కావొచ్చని కొందరు నటులు భావిస్తారు. కానీ సుహాస్ సినిమా కోసం ధైర్యం చేసి పెద్ద నిర్ణయమే తీసుకున్నారు.

ఈ నిర్ణయం పై ఆడియన్స్ సుహాస్ ని అభినందిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. సినిమా సూపర్ అంటూ చెప్పుకొస్తున్నారు. నిజ జీవితంలో జరిగే సంఘటనలు ఆధారంగా తీసుకోని సినిమాని రియలిస్టిక్ గా చాలా బాగా తెరకెక్కించినట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో శివాని హీరోయిన్ గా నటించారు. ఫిదా ఫేమ్ శరణ్య.. హీరో సిస్టర్ గా బలమైన పాత్రలో నటించారు.