They Call Him OG : పవన్ OG కోసం సీరియస్ డిస్కషన్స్ లో థమన్, సుజీత్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవాలి..

తాజాగా ‘They Call Him OG’ సినిమా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్ సీరియస్ గా కుర్చొని డిస్కషన్స్ చేస్తున్న ఫోటోని చిత్రయూనిట్ షేర్ చేసి ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలిపారు.

Sujeeth and Thaman Serious Discussions for Pawan Kalyan They Call Him OG Movie

They Call Him OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. చేతిలో మూడు సినిమాలు ఉన్నా అన్ని ఎన్నికల తర్వాతే రానున్నాయి. పవన్ నుంచి రాబోతున్న ‘They Call Him OG’ సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత పవన్ మాఫియా నేపథ్యంలో ఓ స్టైలిష్ సినిమా చేస్తుండటంతో పాటు ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్, పవన్ లుక్స్ తో సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి, అర్జున్ దాస్.. పలువురు ముఖ్య పాత్రల్లో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న OG సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కి చెందిన కొంత భాగం తప్ప మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయినట్టు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టు సమాచారం.

Also Read : Krithi Shetty : బాబోయ్.. కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్ చూశారా?

తాజాగా ‘They Call Him OG’ సినిమా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్ సీరియస్ గా కుర్చొని డిస్కషన్స్ చేస్తున్న ఫోటోని చిత్రయూనిట్ షేర్ చేసి ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలిపారు. ఇప్పటికే ట్రైలర్ లో ఇచ్చిన BGM అదిరిపోయింది. దీంతో సినిమాకు ఏ రేంజ్ BGM ఇస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ – మ్యూజిక్ డైరెక్టర్ ఇలా సీరియస్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ వేయడంతో సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలని, పవన్ కి ఎలివేషన్స్ లో BGM సూపర్ గా ఉండాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ తన రాజకీయాలతో బిజీగా ఉన్నా రెగ్యులర్ గా OG సినిమా కోసం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తున్నారు.