Sukumar Sandeep Reddy Vanga and Some Other Indian Directors in One Frame Photo goes Viral
Indian Directors : అప్పుడప్పుడు సెలబ్రిటీలు కలిసి కనిపిస్తే ఆ ఫోటోలు వైరల్ అవుతాయి. ఇక స్టార్ సెలబ్రిటీలు అయితే మరింత వైరల్ అవ్వాల్సిందే. తాజాగా పలువురు డైరెక్టర్స్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ తన సోషల్ మీడియాలో ఈ ఫోటో షేర్ చేసాడు.
ఈ ఫొటోలో సాయి రాజేష్ తో పాటు ఇటీవల పుష్ప 2తో ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్, అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ని, యానిమల్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ లో తన సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ తో పాటు మరో బాలీవుడ్ డైరెక్టర్, ఇంకో ఇద్దరు ఉన్నారు.
ముఖ్యంగా సుకుమార్ – సందీప్ రెడ్డి వంగ ఒక ఫ్రేమ్ లో ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. తాజాగా రామానాయుడు స్టూడియోలో ఓ ప్రోగ్రాంలో భాగంగా వీరంతా కలిసినట్టు సమాచారం. సందీప్ రెడ్డి వంగ త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరోసారి షాక్ చేయడానికి రెడీ అయ్యాడు. సుకుమార్ పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో RC17 సినిమా వర్క్ తో బిజీగా ఉన్నాడు. సాయి రాజేష్ బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. అనురాగ్ కశ్యప్ ఇటీవల ఎక్కువగా నటుడిగా సినిమాలు చేస్తున్నాడు.