×
Ad

Veera Kogatam: డైరెక్టర్ గా సుకుమార్ మరో శిష్యుడు.. ఈసారి డిఫరెంట్ జానర్ తో.. కిరణ్ కి మరో హిట్ గ్యారంటీ!

సుకుమార్.. ఈ స్టార్ డైరెక్టర్ భారీ హిట్స్ నే కాదు సూపర్ డైరెక్టర్స్ ని కూడా టాలీవుడ్ కి అందిస్తున్నాడు.(Veera Kogatam) ఇప్పటికే ఆయన దగ్గర పని చేసిన చాలా మంది టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా మారిపోయారు.

Sukumar's disciple Veera Kogatam is doing a film with Kiran Abbavaram.

Veera Kogatam: సుకుమార్.. ఈ స్టార్ డైరెక్టర్ భారీ హిట్స్ నే కాదు సూపర్ డైరెక్టర్స్ ని కూడా టాలీవుడ్ కి అందిస్తున్నాడు. ఇప్పటికే ఆయన దగ్గర పని చేసిన చాలా మంది టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా మారిపోయారు. వారిలో ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సనా.. కుమారి 21F, 18 పేజెస్ సినిమాలు చేసిన సూర్యప్రతాప్.. నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల.. సాయి దుర్గ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ సినిమా(Veera Kogatam) చేసిన కార్తీక్ వర్మ.. సుహాన్ తో ప్రసన్నవదనం సినిమా చేసిన అర్జున్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు. ఈ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ వీక్ ఎలిమినేషన్.. మరో కామనర్ ఎలిమినేటెడ్

ఇప్పుడు ఈ లిస్టులో సుకుమార్ మరో శిష్యుడు చేరనున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు వీరా కోగటం. పుష్ప, పుష్ఫ 2 లాంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు వీరా. ఆ సమయంలోనే తన దగ్గర ఉన్న ఒక కథను గురువు సుకుమార్ కు వినిపించగా ఆయన ఒకే చేశాడట. అదే కథను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కి చెప్పడంతో ఆయన కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. ఈ ప్రాజెక్టు కోసం థ్రిల్లర్ జానర్ లోనే సరికొత్త స్క్రీన్ ప్లే ని సెట్ చేశాడట దర్శకుడు వీరా. థ్రిల్లర్ జానర్ లోనే సరికొత్తగా ఉండబోతుందట ఏ సినిమా.

అందుకే ఈ సినిమాను సుకుమార్ అన్న కొడుకు అశోక్ బండ్రెడ్డితో కలిసి వంశీ నందిపాటి నిర్మించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇక కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే “క” సినిమా సక్సెస్ తరువాత మళ్ళీ ప్లాప్ ట్రాక్ లోనే వెళ్ళిపోయాడు ఈ హీరో. అందుకే, సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న వీరా పైన చాలా నమ్మకం పెట్టుకున్నాడట. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.