Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ వీక్ ఎలిమినేషన్.. మరో కామనర్ ఎలిమినేటెడ్
బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ వీక్ ఎలిమినేషన్ కు రంగం సిద్ధం అయ్యింది(Bigg Boss 9 Telugu). ఎవరూ ఊహించని విదంగా మరోసారి కామనర్ ఈవారం ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది.

Bigg Boss Season 9 Week 3 Elimination
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ వీక్ ఎలిమినేషన్ కు రంగం సిద్ధం అయ్యింది. ఎవరూ ఊహించని విదంగా మరోసారి కామనర్ ఈవారం ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ నుంచి మొదటివారం శ్రష్టి వర్మ, రెండవవారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. దాంతో మూడవ వారం ఎలిమినేషన్ పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈవారం అందరూ మంచి కంటెస్టెంట్స్ నామినేషన్స్ ఉన్నారు. ఇప్పటికే ఈవారం వైల్డ్ కార్డు ఎంట్రీ (Bigg Boss 9 Telugu)షాకించ్చిన బిగ్ బాస్.. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేశాడు.
Anasuya Photos: వెకేషన్ మోడ్ ఆన్.. స్విమ్మింగ్ పూల్‌లో హాట్ లుక్స్‌తో అనసూయ
మిడ్ వీక్ లో భాగంగా సంజన ఇంటినుంచి బయటకు వచ్చేశారు. అయితే, ఆమె సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ విషయం ఏంటో తెలియాలంటే బిగ్ బాస్ చెప్పేవరకు ఆగాల్సిందే. ఇందులో భాగంగానే ముడవారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేషన్లలో ప్రియ, పవన్ కల్యాణ్, హరీశ్ ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో రాము రాథోడ్ కి టాప్ వోటింగ్ పడింది. ఆ తర్వాతి స్థానంలో ఫ్లోరా సైనీ ఉన్నారు. రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా.. డేంజర్ జోన్ లో హరిత హరీశ్, పవన్ కల్యాణ్, ప్రియ ఉన్నారట. వీరిలో లీస్ట్ వోటింగ్ అంటే పవన్, ప్రియాకి పడింది.
ఈ ఇద్దరిలో ఒకరు మూడవరం ఎలిమినట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో కూడా ప్రియాకి ఎక్కువ ఛాన్స్ ఉన్నయాని తెలుస్తోంది. నిజానికి, ఈ సీజన్ మొదలైనప్పుడు ప్రియకు మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ, తర్వాత ఆమె ప్రవర్తన ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. శ్రీజతో ముచ్చట్లు, అనవసరమైన టాపిక్ లలో మధ్యలో దూరడం వంటివి చేయడం వల్ల ఆడియన్స్ లో ఆమెకు నెగిటీవ్ ఇంపాక్ట్ పడింది. వీటి వల్లనే ఈసారి ప్రియకు తక్కువ ఓట్లు పడ్డాయని, ఫలితంగా ఎలిమినేట్ అయిందనే టాక్ వినిపిస్తుంది.