×
Ad

Suma Kanakala : యాంకర్ సుమకు ఈ రికార్డ్ కూడా ఉందా? అప్పట్లోనే అమెరికాలో..

తాజాగా సుమ కనకాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. (Suma Kanakala)

Suma Kanakala

Suma Kanakala : సుమ కనకాల తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. పలు టీవీ షోలతో తెలుగు వారి ఇళ్లలో ఒకరిగా నిలిచింది. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా స్టార్ యాంకర్ గా అదే ఎనర్జీతో కొనసాగుతుంది సుమ. అయితే సుమ మొదట టీవీ సీరియల్స్ నుంచే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే.(Suma Kanakala)

తాజాగా సుమ కనకాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో సుమ అమెరికాలో ఓ సీరియల్ చేశాను అని చెప్పింది.

Also Read : Anu Emmanuel : ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా.. అను ఇమ్మాన్యుయేల్ కష్టం.. వర్కింగ్ స్టిల్స్..

సుమ మాట్లాడుతూ.. ఒక సీరియల్ షూటింగ్ అమెరికాలో జరిగింది. ఆ సీరియల్ పేరు గీతాంజలి. అమెరికాలో ఫస్ట్ సీరియల్ షూటింగ్ జరిగింది మాదే. 1997లో ఈ సీరియల్ షూటింగ్ జరిగింది. ఒక సింగిల్ కెమెరా పట్టుకొని
మా అమ్మ, నేను, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్ అయిదుగురు మాత్రమే ఇక్కడ్నుంచి వెళ్ళాము. సీరియల్ లో నటించిన వాళ్లంతా అక్కడ ఉన్న తెలుగువాళ్లే. మా వంటలు మేమే వండుకున్నాము, నేనే అందరికి మేకప్ వేసాను. లైటింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేనే ఆ సీరియల్ కి అని తెలిపింది.

ఇప్పటికే యాంకరింగ్ లో, టీవీలో అనేక రికార్డులు సెట్ చేసింది యాంకర్ సుమ. ఇప్పుడు అమెరికాలో ఫస్ట్ షూటింగ్ చేసిన తెలుసుగు సీరియల్ అనే రికార్డ్ కూడా తన పేరు మీదే ఉందని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ సీరియల్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. సుమ గీతాంజలి సీరియల్ అని సెర్చ్ చేస్తే 13 ఎపిసోడ్స్ సీరియల్ అందుబాటులో ఉంది.

Also Read : Dhee Raju : రాజు బ్రేకప్ స్టోరీ.. ఆమె ఇప్పుడు వేరే అబ్బాయితో.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను.. కాళ్ళు పట్టుకొని..