Suma Charan
Anchor Suma: టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు వెళ్తుంటారు కానీ సుమ మాత్రం ఎవర్ గ్రీన్.. చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారామె. ఆమె హోస్ట్ చేసే ప్రతి టీవీ షో సక్సెస్ అయ్యింది. ఇక సినిమా ఫంక్షన్లలో సుమలా ఎవరూ యాంకరింగ్ చెయ్యలేరు.
Pawan Kalyan – Mahesh Babu : ‘థ్యాంక్యూ అన్నా అండ్ పవన్’..
ఇప్పుడు సుమ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు నన్ను బుల్లితెర మీద ఆదరించినందుకు, మీ సపోర్ట్‌కి థ్యాంక్స్.. దేవుడి దయతో ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఇస్తున్నాను’ అంటూ ఇటీవల పోస్టర్ షేర్ చేసి సుమ.. నవంబర్ 6న తన సినిమా టైటిల్‌తో పాటు, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చెయ్యబోతున్నారని చెప్పారు..
Puneeth Rajkumar : వైరల్ అవుతున్న పునీత్ పిక్స్.. ఫ్యాన్స్ ఎమోషనల్..
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వరవాణి కీరవాణి సంగీతమందిస్తున్నారు. 1996లో దర్శకరత్న దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేసిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సుమ తర్వాత బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయారు.