Roshan Kanakala : యాంకర్ సుమ కొడుకు హీరోగా ఫస్ట్ మూవీ.. వెరైటీ టైటిల్‌తో.. లాంచ్ చేసిన రాజమౌళి..
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు రోషన్. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
- Saketh U
- Published on- October 7, 2023 / 11:25 AM IST
Suma Kanakala Son Roshan Kanakala first Movie Title and Poster Launch by Rajamouli
Roshan Kanakala : ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై యాంకర్ గా మెప్పిస్తూ తెలుగు వారి ఇళ్లల్లో ఒకరిగా అయిపొయింది యాంకర్ సుమ కనకాల(Anchor Suma Kanakala). యాంకర్ గా చేస్తూనే పలు సినిమాల్లో కూడా అప్పుడప్పుడు మెరిపించింది. ఇక బయట ఈవెంట్స్ తో కూడా ఫుల్ బిజీగా ఉంటుంది. సుమ భర్త రాజీవ్ కనకాల(Rajeev Kanakala) కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజీవ్ కనకాల తల్లి తండ్రులు కూడా నటులే అని అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి హీరో రాబోతున్నాడు.
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు రోషన్. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా రోషన్ కనకాల మొదటి సినిమా టైటిల్ ని రాజమౌళి(Rajamouli) లాంచ్ చేశారు.
రోషన్ కనకాల మొదటి సినిమా టైటిల్ ‘బబుల్ గమ్’ అని ప్రకటిస్తూ.. రాజమౌళి రోషన్ డెబ్యూట్ కి కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్స్ హత్తుకొని ఉండగా హీరో నోట్లోంచి బబుల్ గమ్ తో బెలూన్ ఊదుతున్నాడు. రొమాంటిక్ లుక్ లో ఈ పోస్టర్ ఉంది. ఇక ఈ సినిమాలో మానస చౌదరి అనే తమిళమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. మరి రోషన్ కనకాల ఈ బబుల్ గమ్ తో ఎలా మెప్పిస్తాడా చూడాలి.
