Suma Rajeev Kanakala
Suma Rajeev Kanakala : యాంకర్ సుమ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లో ఒకరిగా మారిపోయింది. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటుడిగా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. సుమ – రాజీవ్ కనకాల జంట ఎప్పుడు కలిసి కనిపించినా ఫ్యాన్స్ సంతోషిస్తారు. తాజాగా యాంకర్ సుమ చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ తన గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.(Suma Rajeev Kanakala)
ఈ క్రమంలో సుమ తనకు కలలు వస్తాయని, ఒక్కోసారి ఆ కలలు నిజం అవుతాయి. ఆ విషయంలో భయం వేస్తుంది అని ఓ సంఘటన గురించి తెలిపింది.
సుమ కనకాల మాట్లాడుతూ.. నాకు వచ్చే కొన్ని డ్రీమ్స్ నిజం అవుతాయి. రాజీవ్ ఏ ఫిలిం బై అరవింద్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ప్రగ్నెంట్. సెకండ్ టైం ప్రగ్నెన్సీ. నాకు అప్పుడు ఒక కల వచ్చింది. ఆయన కొండ మీద నుంచి పడిపోయి కాలు ట్విస్ట్ అయి నన్ను చూస్తూ కాలు విరిగింది అని అరుస్తున్నట్టు కల వచ్చింది. నెక్స్ట్ డే నాకు అసలు అతను కాంటాక్ట్ లోకి రాలేదు. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. ల్యాండ్ లైన్స్ లోనే మాట్లాడాలి.
రాజీవ్ తలకోనలో షూటింగ్ లో ఉన్నాడు. ఒక రోజు గ్యాప్ తర్వాత ఆయన కాల్ చేసారు. నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే బాగానే ఉన్నాను ఎందుకు అడుగుతున్నావు అంటే నాకు వచ్చిన కల చెప్పాను. అప్పుడు రాజీవ్ కూడా షాక్ అయి నిజంగానే నా కాలు విరిగింది. షూట్ లో చెట్టుకు వెళ్లి గుద్దుకొని కాలు కి మోకాలు దగ్గర దెబ్బ తగిలింది అని చెప్పాడు. అప్పటికప్పుడు నేను బయలుదేరి వెళ్లి ఆయనకు బేసిక్ ట్రీట్మెంట్, పుత్తూరు కట్టు కట్టించాను. కానీ ఆయన షూటింగ్ మధ్యలో ఆపడం వద్దు, అందరు లాస్ అవుతారు అని షూటింగ్ చేసి వస్తా అన్నాడు. ఇలాంటి డ్రీమ్స్ కొన్ని జరిగాయి. అప్పుడప్పుడు ఈ డ్రీమ్స్ వల్ల భయం వేస్తుంది నాకు అని తెలిపింది.
Also Read : NTR : తెల్లారితే ఎన్టీఆర్ ముందు డ్యాన్స్ చేయాలి.. కానీ వీల్ చైర్ లో రాజు.. ఎన్టీఆర్ ఏమన్నాడంటే..