Suma Kanakala : ‘గొప్ప మనసు చాటుకున్న సుమ’.. ఇంత మందికి సహాయం చేస్తుందా..

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Suma who has a great heart helping with Festivals for Joy foundation

Suma Kanakala : టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుమ అంటే తెలియని రెండు రాష్ట్రాల ప్రజలు ఉండరని చెప్పొచ్చు. చిన్న సినిమాల దగ్గర నుండి స్టార్ హీరో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది సుమ. కేవలం ఈవెంట్స్ మాత్రమే కాకుండా పలు షోస్, అలాగే మాల్ ఓపెనింగ్స్ వంటివి చేస్తూ.. స్టార్ హీరో, హీరోయిన్స్ కి సమానంగా సుమ సంపాదిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read : Mahesh Babu : ‘గర్వంగా ఉంది’.. మేనల్లుడి సక్సెస్ పై మహేష్ ట్వీట్..

అయితే ఇంత గొప్ప స్టార్ యాంకర్ గుర్తింపు సంపాదించుకున్న సుమ ఎందరికో సహాయం చేస్తుంటుంది. అలా “ఫెస్టివల్ ఫర్ జాయ్” ద్వారా ఇప్పటికే 30కి పైగా విద్యార్థులకు, 30కి పైగా సెక్స్ ట్రాఫికింగ్ సర్వైవర్‌లకు సహాయం అందిస్తుంది. అలాగే 200 పైగా కంటి చికిత్సలను చేయించింది. అంతేకాకుండా ఎన్నో అంగన్‌వాడీ కేంద్రాలను సరిచేయించింది. ఇలా ఈ ఫౌండేషన్ ద్వారా ఎందరికో సహాయం అందిస్తుంది సుమ. ఇక సుమ చేసిన ఈ మంచి పనులను నెటిజన్స్ అభినందిస్తున్నారు.


గతకొంత కాలంగా సుమ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ఫౌండేషన్ ను “ప్రతి నిరుపేదల జీవితాల్లో సంతోషాన్ని.. ప్రతి పండుగను ఆనందంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకొని స్టార్ట్ చేసింది”. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ విజయవంతంగా సాగుతుంది.