Mahesh Babu : ‘గర్వంగా ఉంది’.. మేనల్లుడి సక్సెస్ పై మహేష్ ట్వీట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ.

Mahesh Babu : ‘గర్వంగా ఉంది’.. మేనల్లుడి సక్సెస్ పై మహేష్ ట్వీట్..

so Proud Mahesh babu tweets on nephew Ashok Galla Devaki Nandana Vasudeva movie success

Updated On : November 23, 2024 / 12:17 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి రావడంతో ఇప్పటికే ఈ యంగ్ హీరోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న(22 నవంబర్)న రిలీజ్ అయ్యింది. ఇక విడుదలైన మొదటి ఆట నుండే పాసిటివ్ టాక్ తెచ్చుకుంది దేవకీ నందన వాసుదేవ.

Also Read : Chiranjeevi – Allu Arjun : అల్లు అర్జున్, చిరంజీవిని ఏమని పిలుస్తాడో తెలుసా..

అయితే మహేష్ బాబు మేనల్లుడు కావడంతో తన వంతు ఈ సినిమాను ప్రమోట్ చేసారు మహేష్. తాజాగా దేవకీ నందన వాసుదేవ మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోవడంతో మహేష్ బాబు ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ‘అశోక్ గల్లా.. సినిమాలో నీ మార్పు చాలా బాగుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ టీమ్ అందరికి నా అభినందనలు” అంటూ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు మహేష్ బాబు.

దీంతో మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే ఈ సినిమాకి హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందిచడం విశేషం. కాగా ఇందులో మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.