×
Ad

Jani Master: జానీ మాస్టర్ భార్యకు కీలక పదవి.. ఇక నుంచి..

తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షురాలిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master) భార్య సుమలత అలియాస్‌ అయేషా ఎంపికయ్యారు.

Sumalatha alias Ayesha elected as president of Telugu Dancers Association

Jani Master: తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షురాలిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master) భార్య సుమలత అలియాస్‌ అయేషా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి జోసెఫ్‌ ప్రకాష్‌ మాస్టర్‌పై 29 ఓట్ల మెజారిటీతో గెలిచారు సుమలత. డాన్సర్స్‌ అసోసియేషన్‌ లో మొత్తం 510 ఓట్లు ఉండగా, 439 మంది డాన్సర్స్ ఓటింగ్ లో పాల్గొన్నారు. వాటిలో, జోసెఫ్‌ ప్రకాష్‌ మాస్టర్‌కు 199 ఓట్లు రాగా.. సుమలతకు 228 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు కేవలం 11 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో, సుమలత విజయం సాధించినట్లు ప్రకటించారు.

Police Complaint: వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంటగా ‘పోలీస్ కంప్లెయింట్’.. షూటింగ్ పూర్తి, త్వరలోనే విడుదల

ఇక గతంలో కూడా జానీ మాస్టర్‌ డాన్సర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పని చేశారు. ఈసారి కూడా జానీ మాస్టర్‌ పోటీ చేస్తారని అనుకున్నారు అంతా.. కానీ తన భార్య సుమలతను రంగంలోకి దించాడు. ఇక భార్య విజయంతో జానీ ఆనందం చేశాడు. దీనికి సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అనంతరం, జానీ, సుమలత డాన్స్ యూనియన్ ఫౌండర్ ముక్కు రాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.