Police Complaint: వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంటగా ‘పోలీస్ కంప్లెయింట్’.. షూటింగ్ పూర్తి, త్వరలోనే విడుదల
గ్లామర్ మాత్రమే కాదు నటన పరంగా కూడా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్(Police Complaint). లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ గా మారిపోయింది.
varalakshmi sarathkumar 'police complaint' movie shooting complete
Police Complaint: గ్లామర్ మాత్రమే కాదు నటన పరంగా కూడా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “పోలీస్ కంప్లెయింట్(Police Complaint)”. నవీన్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్నాడు. MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహరాణా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఈనేపథ్యంలోనే ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో వరలక్ష్మి చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఆమె ఫస్ట్ టైం పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో చేయడం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అంటూ నిర్మాతలు తెలిపారు. ఇంకా ఈ సినిమాలో కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి ,సప్తగిరి, జెమినీ సురేష్ ,అమిత్, దిల్ రమేష్, పృథ్వీ (యానిమల్) తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు అని చెప్పారు.
ఇక దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా తెరకెక్కింది. ఇదే విషయాన్ని హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కొత్త కోణంలో చూపించనున్నాం. చిత్రయూనిట్ అందరి సపోర్టుతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం. సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే విడుదలకు సన్నాహాలు చేస్తాము” అంటూ చెప్పుకొచ్చాడు.
