×
Ad

Chiranjeevi : పూర్తిగా క్లారిటీ ఇచ్చిన సుమన్.. బ్లూ ఫిలిమ్స్ కేసు.. అది చేసింది చిరంజీవి కాదు.. నా మీద గుండా యాక్ట్ పెట్టి..

నటుడు సుమన్ 10 టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ కేసు గురించి అప్పటి సంఘటనల గురించి మాట్లాడారు. (Chiranjeevi)

Chiranjeevi

Chiranjeevi : హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు నటుడు సుమన్ మీద పలు కేసులు అక్రమంగా పెట్టి జైలులో వేశారు. గుండా యాక్ట్ కింద పలు కేసులు, బ్లూ ఫిలిమ్స్ కేసు పెట్టారు. అయితే ఇది చిరంజీవి చేయించారని పలు రూమర్స్ వచ్చాయి. గతంలో పలుమార్లు దీనిపై సుమన్ స్పందించాడు. తాజాగా సుమన్ దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు.(Chiranjeevi)

నటుడు సుమన్ 10 టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ కేసు గురించి అప్పటి సంఘటనల గురించి మాట్లాడారు.

Also Read : Annamayya : ‘అన్నమయ్య’ చెయ్యను అని చెప్పా.. వేంకటేశ్వరస్వామి పాత్రపై సుమన్ కామెంట్స్ వైరల్.. పాపం 8 నెలలు..

సుమన్ మాట్లాడుతూ.. అప్పుడు టైం అలా ఉంది అలా జరిగింది. 1985 నుంచి మూడేళ్లు సఫర్ అయ్యాను దాని వల్ల. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అది జరగడం వల్ల నాకు చాలా నష్టం జరిగింది. నా మీద గుండా యాక్ట్ కేసు పెట్టారు. బ్లూ ఫిలింస్ అసలు క్రైమ్ కాదు, అది గూండా యాక్ట్ కిందకు రాదు అని తర్వాత డిస్కషన్ జరిగింది. నకిలీ మద్యం, బెదిరించడం, చంపేస్తానని బెదిరించడం.. ఇలాంటివన్నీ పెట్టారు.

గుండా యాక్ట్ మీద నా లాయరు ఫైట్ చేసి బెయిల్ తీసుకున్నారు. సౌత్ ఇండియాలో ఫస్ట్ బెయిల్ తీసుకున్నది నేనే ఈ కేసులో. నేను క్రైమ్ చేశాను అని చెప్పిన డేట్స్ లో నేను వేరే షూట్ లో ఉన్నాను అని ప్రూఫ్ లు పెట్టాక కేసు కొట్టేసారు. ఆ కేసు నుంచి బయటకు రావడానికి కాస్త టైం పట్టింది. తమిళనాడు గవర్నర్ ని మా మదర్ కలిసి మాట్లాడారు అప్పుడు ఆ కేసు ముందుకు వచ్చి ఫేక్ కేసు అని క్లోజ్ అయింది అన్నారు.

Also Read : Suman : ఆదిపురుష్ సినిమాపై సుమన్ ఫైర్.. ఇలా వేరే మతం మీద తీయగలరా..?

అయితే ఇది చిరంజీవి చేయించారు అనే ఆరోపణలపై స్పందిస్తూ.. మా ఫ్రెండ్స్ విషయంలో ఒక ఇష్యూ ఉంది. మా స్నేహితుడి ప్రేమ విషయం. లవ్ మ్యారేజ్. అవతలి వాళ్ళు నా మీద, నా ఫ్రెండ్స్ మీద ఈ ఫేక్ కేసులు పెట్టించారు. అది మాకు ఎఫెక్ట్ అయింది. ఇది చేసింది సినిమా వాళ్ళు కాదు. మిగిలిన వాళ్ళ గురించి న్యూస్ రాలేదు. నేను సెలబ్రిటీని కాబట్టి బయటకు వచ్చింది. తర్వాత మా తప్పేమి లేదు అని తెలిసి ఈ కేసుని వెనక్కి తీసుకుంటా అన్నారు.

చిరంజీవి చేసాడు అనేది అవన్నీ నచ్చని వాళ్ళు పుట్టించారు. ఇండస్ట్రీ లో నాకు – చిరంజీవికి పోటీ ఉండేది. అందుకే ఆయన పేరు వచ్చింది. నేను చిరంజీవి బాగానే ఉంటాము. మా సినిమాల మధ్య పోటీ ఉండేది అంతే. మా ఇద్దరి మధ్య ఈ టాపిక్ చాలా సార్లు వచ్చింది. ఒక జర్నలిస్ట్ దగ్గర కూడా చిరంజీవి మేము బాగానే ఉంటాము, కలుసుకుంటాము ఇన్నిసార్లు ఇలా రాయడం కరెక్ట్ కాదు అని అన్నాడు అని క్లారిటీ ఇచ్చారు. దీంతో అసలు సుమన్ జైలుకు వెళ్లే కేసులో చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Suman : ఒక్క సినిమా.. డైరెక్ట్ ప్రసిడెంట్ ఆఫ్ ఇండియాతో కుర్చోపెట్టింది.. హాఫ్ డే ఆయనతో..