Suman Tej Garima Chauhan Gagan Vihari Seetha Kalyana Vaibhogame Trailer Released
Seetha Kalyana Vaibhogame Trailer : డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాచాల యుగంధర్ నిర్మాణంలో సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా, గగన్ విహారి విలన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నిర్మాతలు హర్షిత్ రెడ్డి, బెక్కెం వేణుగోపాల్ అతిధులుగా విచ్చేసారు.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది. తాజాగా రిలీజయిన సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఓ మై ఫ్రెండ్ సినిమా సమయంలో డైరెక్టర్ సతీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ మూవీ కథ నాకు ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. మూవీ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుంది. తెలుగు సంప్రదాయాన్ని చాటేలా ఈ టైటిల్ ఉంది. సతీష్ తీసిన గత సినిమా ఊరికి ఉత్తరాన నాకు బాగా నచ్చింది. ఈ సినిమాతో సతీష్‌కు మరో విజయం దక్కాలి అని అన్నారు.
డైరెక్టర్ సతీష్ పరమవేద మాట్లాడుతూ.. మా సినిమా పాటలు, ట్రైలర్ టీ-సీరిస్ ద్వారా రిలీజ్ అయ్యాయి. ట్రైలర్ అందరికీ నచ్చింది. హర్షిత్ రెడ్డి గారి కజిన్ సుమన్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. రాముడి గుడి లేని ఊరు ఉండదు. ఆయన బతికిన విధానం వల్లే అందరికీ దేవుడిలా గుర్తుండిపోయాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొనే ఈ కథ రాసుకున్నాను. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది అని తెలిపారు.
నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ.. మా సినిమా చిన్న సినిమాగా మొదలయి పెద్ద సినిమాగా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గగన్ విహారి అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో విలన్ గా కూడా మరింత బాగా నటించాడు. ఊరికి ఉత్తరాన సినిమాతో సతీష్ విజయం అందుకొని ఇప్పుడు సీతా కళ్యాణ వైభోగమేతో రాబోతున్నాడు. జూన్ 21న మా సినిమా రాబోతోంది అని తెలిపారు.