×
Ad

‘ఊరి పేరు భైరవకోన’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవకోన’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. పబ్లిక్ టాక్ ఎలా ఉంది..?

  • Published On : February 16, 2024 / 07:41 AM IST

Sundeep Kishan Ooru Peru Bhairavakona Twitter Review and Public Response

Ooru Peru Bhairavakona Review : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ధ్యేయంతో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన చిత్రం ‘ఊరి పేరు భైరవకోన’. డిఫరెంట్ జోనర్స్ తో సినిమాలు తెరకెక్కించే వీఐ ఆనంద్.. ఈ మూవీని సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందించారు. వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటించారు.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అండ్ టీజర్, రెండు క్రిందటే పడిన ప్రీమియర్స్.. మూవీ పై మంచి బజ్ నే క్రియేట్ చేశాయి. మరి ఈరోజు అందరి ముందుకు వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉంది. మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఏం చెబుతున్నారు..?

థియేటర్ లో చూడాల్సిన మూవీ, చాలా బాగుంది, తప్పకుండా వెళ్ళండి అంటూ చెప్పుకొస్తున్నారు. హర్ష, వెన్నెల కిశోర్ కామెడీ అయితే అదిరిపోయిందట. ఫస్ట్ హాఫ్ బాగుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అదిరిపోయిందని చెబుతున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ గా సాగిందని చెబుతున్నారు.

Also read : Varsha Bollamma : మీమ్ లాంగ్వేజ్‌లో జర్నలిస్ట్‌కి.. సూపర్ కౌంటర్ ఇచ్చిన వర్ష.. వీడియో వైరల్

మూవీలో ట్విస్ట్ లను డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేసాడని చెబుతున్నారు. శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎమ్ అండ్ సాంగ్స్ మూవీకే హైలైట్ అని చెబుతున్నారు. ఇంటర్వెల్ ని ఓ రేంజ్ లో చూపించిన దర్శకుడు క్లైమాక్స్ ని మాత్రం ఆ స్థాయిలో చూపించడంలో కొంచెం తడబడ్డాడని చెబుతున్నారు.

సందీప్ కిషన్ అండ్ వర్ష బొల్లమ్మ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందట. టెక్నికల్ పరంగా కూడా దర్శకుడు మెప్పించాడట. కథ, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్న ఈ సినిమాకి ఆడియన్స్.. 2.5-3 రేటింగ్ ఇస్తున్నారు.