Varsha Bollamma : మీమ్ లాంగ్వేజ్‌లో సూపర్ కౌంటర్ ఇచ్చిన వర్ష.. బానే ఎక్స్‌ట్రాలు.. వీడియో వైరల్

‘ఊరి పేరు భైరవకోన’ ప్రెస్ మీట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఓ జర్నలిస్ట్ కి మీమ్ లాంగ్వేజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Varsha Bollamma : మీమ్ లాంగ్వేజ్‌లో సూపర్ కౌంటర్ ఇచ్చిన వర్ష.. బానే ఎక్స్‌ట్రాలు.. వీడియో వైరల్

Varsha Bollamma strong counter to journalist in Ooru Peru Bhairavakona press meet

Updated On : February 16, 2024 / 3:02 PM IST

Varsha Bollamma : టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ.. చాలా హుషారుగా సరదా సరదాగా కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే వర్ష.. నెట్టింట ట్రెండ్ అయ్యే మీమ్స్ ని కూడా ఫాలో అవుతుంటారు. అప్పుడప్పుడు ఆ మీమ్ లాంగ్వేజ్ లోనే పోస్టులు, కామెంట్స్ చేస్తూ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంటారు. తాజాగా ‘ఊరి పేరు భైరవకోన’ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ కి ఆ మీమ్ లాంగ్వేజ్ లోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘ఊరి పేరు భైరవకోన’ మూవీలో కావ్య తాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ నటించారు. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రెస్ మీట్ నిన్న నిర్వహించారు. ఇక మీడియా ఇంటరాక్షన్ లో ఓ జర్నలిస్ట్, కావ్య తాపర్‌తో.. “ఇటీవల రిలీజైన ఈగల్ మూవీ ఈవెంట్స్‌లో, ఇప్పుడు భైరవకోన ఈవెంట్స్‌లో మీరు అందాలు ఆరబోస్తూ చాలా హాట్‌గా కనిపిస్తున్నారు. మీరు ఇలా చేయడం వెనుక ఏమైనా స్ట్రాటిజి ఉందా” అంటూ ప్రశ్నించారు.

Also read : Vishwak Sen : రామ్‌చరణ్‌ని ఎందుకు కలిశాను.. అనేది అడగకండి.. విశ్వక్ రహస్యం ఏంటి..?

ఈ ప్రశ్నకు కావ్య తాపర్ కొంచెం ఇబ్బంది పడినట్లే కనిపించారు. అయితే ఆ ప్రశ్న అడగగానే వర్ష మైక్ తీసుకోని జర్నలిస్ట్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ తో జర్నలిస్ట్ ఇబ్బంది పడేలా చేసారు. వర్ష ఇచ్చిన కౌంటర్ ఏంటంటే.. “మీరు అడిగిన ప్రశ్న విన్న తరువాత, ఈమధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఓ డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఆ డైలాగ్ ఏంటంటే.. ‘బాగానే ఎక్స్‌ట్రాలు చేస్తున్నావురా’ అనేది గుర్తుకు వస్తుంది” అంటూ కౌంటర్ ఇచ్చింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ‘ఊరి పేరు భైరవకోన’ సినిమా విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేసారు. ఈ మూవీని పెయిడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ కి రెండు రోజులు ముందుగానే థియేటర్స్ లోకి తీసుకు వచ్చేసారు మేకర్స్. ట్రైలర్ అండ్ టీజర్ బాగా ఆకట్టుకోవడంతో.. ప్రీమియర్స్ తో అదిరిపోయే కలెక్షన్స్ ని నమోదు చేసింది. కేవలం ప్రీమియర్స్ తోనే కోటికి పైగా కలెక్షన్స్ ని అందుకొని సందీప్ బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.