Sundeep Kishan
Sundeep Kishan To Take Care Of Children : కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకెన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి కష్టకాలంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా, ఒంటరైన పిల్లల బాధ్యతను తీసుకుంటానని ట్విట్టర్ వేదికగా సందీప్ కిషన్ ప్రకటించారు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశారు.
”కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా, ఒంటరైన పిల్లల వివరాలు నాకు (sundeepkishancovidhelp@gmail.com) తెలియజేయండి.. వారి కోసం నేను ఉంటాను.. వారి ఆలనాపాలనా, చదువు సంధ్యలు రాబోయే రోజుల్లో నేను చూసుకుంటాను” అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.
‘ఈ కష్టకాలంలో చిన్నారులెవరైనా కోవిడ్ కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు అయితే.. వారి బాధ్యతలను నేను, నా టీమ్ తీసుకుంటాం. కొన్నేళ్ల పాటు వారికి తిండి, చదువు, అవసరమైన వాటినన్నింటిని సమకూర్చేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. ఈ కష్టకాలంలో అందరం ఒకరికొకరం అండగా నిలబడాలి. అందరూ ఇంటి దగ్గరే ఉండి, క్షేమంగా మీ ప్రాణాలను కాపాడుకోండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు చేతనైన సాయం చేసి ఆదుకోండి..” అని సందీప్ కిషన్ తన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సందీప్ కిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. సందీప్ కిషన్ ఇప్పుడు అదే పని చేశారు. అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని నిర్ణయించడం చాలా గొప్ప విషయం. ఈ కష్టకాలంలో సందీప్ కిషన్ తీసుకున్న నిర్ణయం అందరికి స్ఫూర్తి కావాలని, మరింతమంది సెలబ్రిటీలు ఆయన బాటలో నడవాలని, ప్రతి ఒక్కరూ మానవత్వం చూపాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.
Please Pass on the word..
Love you All ❤️
SK pic.twitter.com/tsgRsgJtSz— Sundeep Kishan (@sundeepkishan) May 3, 2021