రెండో భర్తతోనూ విడిపోయింది.. అబద్ధం అంటున్న ‘సైరా’ సింగర్ భర్త

పాపులర్ సింగర్ సునిధి చౌహాన్ తన భర్త నుండి విడిపోయింది అనే వార్త వైరల్ అయింది. దీంతో ఆమె భర్త స్పందించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో తాము విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లే

రెండో భర్తతోనూ విడిపోయింది.. అబద్ధం అంటున్న ‘సైరా’ సింగర్ భర్త

Updated On : January 20, 2022 / 5:28 PM IST

పాపులర్ సింగర్ సునిధి చౌహాన్ తన భర్త నుండి విడిపోయింది అనే వార్త వైరల్ అయింది. దీంతో ఆమె భర్త స్పందించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో తాము విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు సునిధి భర్త హితేష్ సోనిక్.

బాలీవుడ్ వర్గాలవారి సమాచారం ప్రకారం సునిధి, హితేష్ గత కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నారు. ఈ విషయాన్ని వారు ఎప్పుడూ బయటపెట్టలేదు. కాగా ఇటీవల సునిధి, హితేష్ స్నేహితులతో కలిసి గోవా యాత్రకు వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన తరువాత వారి మధ్య వివాదం జరిగినట్లు సమాచారం. సునిధి, హితేష్‌లకు వివాహం జరిగి ఎనిమిదేళ్లు అయ్యింది. రెండేళ్లపాటు డేటింగ్‌‌లో ఉన్న తరువాత 2012లో వీళ్లు వివాహం చేసుకున్నారు.  సునిధి 2018 జనవరిలో ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కాగా ఇది సునిధికి రెండవ వివాహం. 2002లో కొరియోగ్రాఫర్ బాబీ ఖాన్‌‌ను పెళ్లాడింది. తరువాత ఏడాదికి ఇద్దరూ విడిపోయారు.