Site icon 10TV Telugu

Sunny Leone : మరోసారి తెలుగులో ఐటెం సాంగ్ చేస్తున్న సన్నీ లియోన్..

Sunny Leone Doing Item Song in Telugu after PSV Garuda Vega

Sunny Leone

Sunny Leone : బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఇప్పటికే తెలుగులో సినిమాలు, ఐటెం సాంగ్స్ తో మెప్పించింది. ఇప్పుడు మరోసారి తెలుగులో ఐటెం సాంగ్ చేయనుంది.

అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ మోహన్, శ్రీవల్లి సమర్పణలో డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణంలో రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’. యోగేష్ కల్లే, సన్నీ లియోన్, ఆకృతి అగర్వాల్ మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి, చిత్రం శ్రీను, షకలక శంకర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Kingdom : ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ అనౌన్స్.. భారీగా ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?

ఇటీవలే ఈ సినిమాలోని ‘గిప్పా గిప్పా..’ అంటూ సాగే ఐటెం సాంగ్ షూటింగ్ ని సన్నీ లియోన్ పై పూర్తిచేశారు. యోగేష్ కల్లే, సన్నీ లియోన్ కాంబోలో ఈ సాంగ్ తెరక్కింది. దీంతో ఈ పాటతో సన్నీ లియోన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించనుంది. అలాగే ఈ సాంగ్ లో నటి సాహితి దాసరి, ఆకృతి అగర్వాల్ లు కూడా కనపడనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటించనున్నారు.

Exit mobile version