Kingdom : ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ అనౌన్స్.. భారీగా ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
తాజాగా కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని అనౌన్స్ చేసారు.

Kingdom
Kingdom : విజయ్ దేవరకొండ ఒక మంచి సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో రాబోతున్నాడు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో, బ్రదర్ ఎమోషన్ తో కింగ్డమ్ సినిమా రానుంది. జులై 31న కింగ్డమ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. ఇప్పుడు ప్రమోషన్స్ మీద ఫోకస్ చేసారు.
తాజాగా కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ ని అనౌన్స్ చేసారు. విజయ్ కింగ్డమ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 26న తిరుపతిలో ఘనంగా చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టీజర్ తో మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాపై. ఇక ట్రైలర్ కూడా వస్తే కింగ్డమ్ పై మరింత హైప్ పెరగనుంది.
Also Read : War 2 : వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఆ రోజే ఎందుకంటే..
ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా సత్యదేవ్ విజయ్ అన్న పాత్రలో కనిపించబోతున్నాడు.