War 2 : వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఆ రోజే ఎందుకంటే..
తాజాగా వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

War 2
War 2 : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
వార్ 2 సినిమాని ఆగస్టు 14 రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. తాజాగా వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
Also See : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్.. సినిమా నచ్చితే బద్దలు కొట్టేయండి..
మూవీ యూనిట్ వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ.. 25 నంబర్ వార్ 2 సినిమాకు చాలా ప్రాముఖ్యత ఉంది. హృతిక్ రోషన్ & ఎన్టీఆర్ ఇద్దరు బిగ్గెస్ట్ ఐకాన్స్ ఇండియన్ సినిమాలోకి వచ్చి 25 ఏళ్ళు అయిన సందర్భంగా YRF దాన్ని సెలబ్రేట్ చేస్తూ జులై 25న ట్రైలర్ రిలీజ్ చేయనుంది అని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ వార్ 2 ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ANNOUNCEMENT🚨: #WAR2 trailer out on July 25th.#War2 is set to release in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @tarak9999 | @advani_kiara | #AyanMukerji | #YRFSpyUniverse pic.twitter.com/PmWtPQSuTC
— Yash Raj Films (@yrf) July 22, 2025
Also See : పవన్ సినిమా పేర్లన్నీ కలిపి.. కీరవాణి స్పెషల్ సాంగ్.. అదిరిపోయిందిగా.. మీరు కూడా వినేయండి..