Trimukha
Trimukha : యోగేష్ కల్లె, సన్నీ లియోన్, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా త్రిముఖ. మొట్టా రాజేంద్రన్, అషు రెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో రాజేష్ నాయుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. త్రిముఖ సినిమా నేడు జనవరి 30న థియేటర్స్ లో రిలీజయింది.(Trimukha)
ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో చేరడంతో ఈ కథ మొదలవుతుంది. సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మూడు ముఖాలు ఉన్న ఓ ఫేస్ మాస్క్ పెట్టుకొని హత్యలు చేస్తూ ఉంటాడు ఓ వ్యక్తి. ఈ కేసు పోలీసాఫీసర్ శివాని రాథోడ్(సన్నీ లియోన్)చేతికి వస్తుంది. మరో వైపు బాబాలు, దయ్యాలు అన్ని ట్రాష్ అంటూ డాక్టర్ యోగి(యోగేష్ కల్లె) అలాంటి మోసాలను బయటకు తెస్తాడు. ఓ హాంటెడ్ హౌస్ మిస్టరీ చేధించడంతో యోగికి అతని ఫేవరేట్ ప్రొఫెసర్(CID ఆదిత్య శ్రీవాస్తవ) గుడ్ జాబ్ అని మెచ్చుకొని కలవమంటాడు.
యోగి, శృతి(ఆకృతి అగర్వాల్), ప్రవీణ్ వెళ్లి ఆ ప్రొఫెసర్ ని కలవడంతో యోగిని తిట్టి ఆత్మలకు సంబంధించి నీకు మూడు కేసులు ఇస్తాను దమ్ముంటే ఇవి సాల్వ్ చెయ్యి అని చెప్తాడు. యోగి ఛాలెంజ్ గా ఆ కేసులను తీసుకుంటాడు. అసలు ప్రొఫెసర్ ఇచ్చిన మూడు కేసులు ఎవరివి? త్రిముఖ మాస్క్ తో మర్డర్స్ చేసేది ఎవరు? శివాని ఆ మర్డర్స్ చేసే వ్యక్తిని పట్టుకుందా? మొదట యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Thiruveer: డబ్బులు ఇస్తేనే ఇంటర్వూస్.. నేను మోసపోతూనే ఉన్నాను.. హీరో తిరువీర్ షాకింగ్ కామెంట్స్
సన్నిలియోన్ తెలుగులో చేసింది, మర్డర్ మిస్టరీ, CID ఆదిత్య శ్రీవాస్తవ మొదటి తెలుగు సినిమా అని ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా యోగి ఎవరు, అతను ఏం చేస్తాడు, అతను సాల్వ్ చేసే మిస్టరీలతో, అక్కడక్కడా వర్కౌట్ అవ్వని కామెడీతో బాగా సాగదీశారు. ప్రొఫెసర్ యోగికి కేసులు ఇవ్వడంతో అక్కడ్నుంచి ఆసక్తిగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఆ కేసులు సింపుల్ గానే డీల్ చేసేసాడేంటి, ఇంత సింపుల్ గా ఉన్నాయేంటి అనే ప్రశ్న వస్తుంది. అయితే యోగి ఆ కేసుల్ని డీల్ చేసి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాక ఓ ఊహించని ట్విస్ట్ ఇస్తారు.
దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఆ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటాం కానీ సెకండ్ హాఫ్ అంతా గజిబిజిగా, కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఓ పక్క యోగి ఆ కేసుల్ని రీసెర్చ్ చేయడం, సన్నీ లియోన్ త్రిముఖ కేసుని డీల్ చేయడం ఒకేసారి రెండిటిని చూపిస్తూ స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజ్ చేస్తారు.
ఇక క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ తో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. కొన్ని సినిమాల్లో క్లైమాక్స్ లో ప్రేక్షకులను ఫూల్ చేస్తారు. ఈ సినిమాలో కూడా చివర్లో ప్రేక్షకులని ఫూల్ చేసే ప్రయత్నం చేసారు. అసలు ప్రొఫెసర్ ఇచ్చిన కేసుల గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. సన్నీ లియోన్ పాత్రని పూర్తిగా వాడుకోలేదు. కనీసం ఆమెతో ఒక్క డైలాగ్ కూడా చెప్పించలేదు. ఉన్న ఒకటి రెండు మాటలు కూడా డబ్బింగ్ కుదర్లేదు. పవర్ ఫుల్ పోలీస్ అనుకుంటే ఆ పాత్ర సింపుల్ గా ఉంటుంది. యాక్సిండెంట్ అయిన వ్యక్తి మైండ్ లో మాటి మాటికీ నరాల్లో ఏదో జరుగుతుంది అనే సీన్ వేసి సినిమాకు నిడివి పెంచడం తప్ప ఏ ఉపయోగం లేదు అనిపిస్తుంది. చివర్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు వదిలేసి సినిమాకు ఎండింగ్ ఏం ఇవ్వాలో తెలియక పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు అనిపిస్తుంది.
ఆత్మలు, దయ్యాల్ని చేధించే పాత్రలో యోగేష్ కళ్ళే బాగానే నటించాడు. ఆకృతి అగర్వాల్ రెండు పాటల్లో మెరిపించి సినిమా అంతా హీరో పక్కనే ఉండి మెప్పించింది. ప్రవీణ్ అక్కడక్కడా నవ్వించాడు. సన్నీ లియోన్ ఒక ఐటెం సాంగ్ లో మెరిపించినా పోలీస్ పాత్రలో డమ్మీగానే చూపించారు. తనని ఇంకా పవర్ ఫుల్ గా వాడుకునే స్కోప్ ఉన్నా తన పాత్రని సింపుల్ గా చూపించారు.
CID ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ మొదటిసారి తెలుగులో కనిపించి బాగానే నటించారు. అషురెడ్డి ఉన్న కాసేపైనా యాక్టింగ్ తో మెప్పించింది. సాహితీ దాసరి, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్.. పలువురు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Faria Abdullah: భగవంతుడు మూవీ ఈవెంట్ లో ఫరియా అబ్దుల్లా.. ఫొటోలు
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. చాలా వరకు సినిమా రాత్రి పూట ఉండటంతో లైటింగ్ సెటప్ ఇంకాస్త బెటర్ గా పెట్టుకోవాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త హెవీగా అనిపిస్తుంది. సాంగ్స్ మాత్రం వినడానికి బాగున్నాయి. ఓ ఫ్లాష్ బ్యాక్ కథలో AI విజువల్స్ బాగానే వాడారు.
ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ కట్ చేయాల్సింది. స్క్రీన్ ప్లే ఇంకాస్త క్లారిటీగా ఉండేలా ఎడిటింగ్ చేయాల్సింది. రెగ్యులర్ మర్డర్ మిస్టరీ కథ అయినా కొత్త స్క్రీన్ ప్లేతో ట్రై చేసారు కానీ కాస్త కన్ఫ్యూజ్ అయ్యేలా రాసుకున్నారు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా త్రిముఖ సినిమా ఓ మర్డర్ మిస్టరీతో తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ &రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.