సోసోగా సూపర్‌స్టార్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్
పేటా మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా, దాదాపు రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టింది.

పేటా మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా, దాదాపు రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ సినిమా పేట్టా జనవరి 10న, వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. తెలుగులో పేటగా రిలీజ్ చేసారు. తమిళనాట మంచి టాక్ వచ్చింది. తెలుగులో ఇతర సినిమాల పోటీ అధికంగా ఉండడం, థియేటర్లు దొరక్కపోవడం వంటి కారణాల వల్ల, మిక్స్డ్ టాక్ వస్తుంది. పేటా మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా, దాదాపు రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఏరీయాల వారీగా పేటా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
తమిళనాడు : రూ.12.90 కోట్లు
ఏపీ, తెలంగాణా : రూ.3.50 కోట్లు
కర్ణాటక : రూ.3.06 కోట్లు
కేరళ : రూ.1.67 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.1.50 కోట్లు
ఓవర్సీస్ : రూ.15 కోట్లు
మొత్తం : రూ.37.63 కోట్లు (గ్రాస్)
సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించగా, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శశికుమార్ తదితరులు నటించిన పేట్టా, తమిళనాట హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది.
తమిళనాట, ఓవర్సీస్‌లోనూ పెట్టాకి, అజిత్ విశ్వాసం రూపంలో గట్టి పోటీ ఎదురైంది. ఈ పండగ సీజన్ నాటికి పెట్టా ఏ మేరకు వసూళ్ళు రాబడతాడో చూడాలి.
వాచ్ పేటా తెలుగు ట్రైలర్…