Superstar Krishna's last rites today
Superstar Krishna : టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కృష్ణ మంగళవారం తుదిశ్వాస విడవడంతో ఘట్టమనేని కుటుంబంతో పాటు యావత్తు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణకి నివాళులర్పించేందుకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణవిజయ నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు చేరుకుంటున్నారు. మరికాసేపటిలో అయన భౌతికకాకాయని అభిమానుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్ కి తరలించనున్నారు.
Superstar Krishna Passed Away : నేడు తెలుగు సినీ పరిశ్రమ బంద్.. నిర్మాత మండలి!
మధ్యాహ్నం 12 గంటల తరువాత స్వర్గీయ కృష్ణ అంతిమయాత్ర మొదలు కానుంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబిలీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. ఈ అంతిమయాత్రలో అభిమానులతో పాటు టాలీవుడ్ నటులు కూడా పాల్గొనాలంటూ ‘మా’ అసోసియేషన్ పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కృష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలు మధ్య నిర్వహించనున్నారు.
కృష్ణ గౌరవార్ధం టాలీవుడ్ సినీ పరిశ్రమలో నేడు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత మండలి. ఇక తమ అభిమాన నటుడిని కడసారి చూసుకునేందుకు అభిమానులు పద్మాలయ స్టూడియోస్ వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇవాళ కృష్ణకి నివాళు అర్పించనున్నారు.