కార్తీ ‘ఖైదీ’ సినిమాపై మహేష్ ప్రశంసలు!

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ఖైదీ’ మూవీ చూసి సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియచేశారు..

  • Publish Date - November 2, 2019 / 06:36 AM IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ఖైదీ’ మూవీ చూసి సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియచేశారు..

కార్తీ నటించిన ‘ఖైదీ’ దీపావళి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ అయింది.. అన్నిచోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుందీ సినిమాకి.. కార్తీ నటన, లోకేష్ కనకరాజ్ గ్రిప్పింగ్‌గా కథ చెప్పిన విధానంపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్‌గా సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ఖైదీ’ మూవీ చూసి తన స్పందన తెలియచేశారు..

Read Aso : ‘యాక్షన్‌’ ట్రైలర్‌ చాలా చాలా బాగుంది : పూరి జగన్నాధ్

‘ఖైదీ సినిమా చూసాను.. చాలా అద్భుతంగా ఉంది. థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ మరియు సినిమాలోని నటుల పెర్ఫార్మన్స్‌తో పాటు ఆకట్టుకునే స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే.. అలానే ఇటువంటి సబ్జెక్ట్‌లో పాటలు లేకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం, ఈ సినిమా మంచి సక్సెస్ సాధించినందకు టీమ్ మొత్తానికి నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు’ అని మహేష్ ట్వీట్ చేశారు. 

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ రిలీజ్ చేయగా.. ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.