Super Star Rajinikanth Admitted in Hospital at mid night Fans Worried
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి వేళ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Also Read : Jr NTR: పాలిటిక్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ అందుకే అలా అన్నారా?
రజినీకాంత్ తీవ్రమైన కడుపునొప్పితో పాటు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ముందుగానే ప్లాన్ చేసుకున్న ఈ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారు. గుండెకు సంబంధించిన పరీక్షల కోసం రజినీకాంత్ చేరినట్లు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రజినీకాంత్ సన్నిహితులు తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపై రజినీకాంత్ కుటుంబ సభ్యులు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
Actor Rajinikanth hospitalised for severe stomach pain
Read @ANI Story | https://t.co/CswEROvTjW#Rajinikanth #hospitalisation #ApolloHospitals #Chennaipolice pic.twitter.com/T68pLy302G
— ANI Digital (@ani_digital) September 30, 2024
ఇక ప్రస్తుతం రజినీకాంత్ వెట్టయాన్, కూలి సినిమాలతో బిజీగా ఉన్నారు. వెట్టయాన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.