Superstar Rajinikanth Annaatthe Movie In Theatres Nov 4 2021
Annaatthe: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసింది టీం. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ ను దీపావళి కానుకగా 2021 నవంబర్ 4 న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో తలైవా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Rajinikanth : అమెరికాలో అభిమానులతో రజినీకాంత్.. పిక్స్ వైరల్..
రిలీజ్ డేట్‌తో వదిలిన రజినీ పోస్టర్.. ఫ్యాన్స్, మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఖుష్బు, మీనా, జగపతి బాబు, కీర్తి సురేష్, కమెడియన్లు సూర్య, సతీష్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రజినీ పోర్షన్ కొంత వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది.
వరుస హిట్స్ మీదున్న డైరెక్టర్ శివ, రజినీ ఇమేజ్‌కి తగ్గట్టు మంచి పాయింట్‌కి మెసేజ్ యాడ్ చేసి చెప్పబోతున్నారు. ‘అన్నాత్తే’ లో సరికొత్త రజినీకాంత్‌ని చూస్తారని సన్ పిక్చర్స్ సంస్థ చెప్తోంది.‘అన్నాత్తే’ కు డి.ఇమాన్ సంగీతం, వెట్రి పళని స్వామి ఫొటోగ్రఫీ, రూబెన్ ఎడిటింగ్ వర్స్క్ చేస్తున్నారు.
#AnnaattheDeepavali ku ready ah?!@rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer #Annaatthe pic.twitter.com/RVVIqO0xJS
— Sun Pictures (@sunpictures) July 1, 2021