Rajinikanth : అమెరికాలో అభిమానులతో రజినీకాంత్.. పిక్స్ వైరల్..

ప్రస్తుతం రజినీ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు.. అక్కడ తనను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు తలైవా..

Rajinikanth : అమెరికాలో అభిమానులతో రజినీకాంత్.. పిక్స్ వైరల్..

Superstar Rajinikanth Latest Photos With Fans

Updated On : July 1, 2021 / 12:16 PM IST

Rajinikanth: 70 ఏళ్లొచ్చినా ఇంకా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉండే రజినీకాంత్ ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. హెల్త్ ఇష్యూస్‌తోనే పాలిటిక్స్ నుంచి మిడిల్ డ్రాప్ అయిన రజినీకాంత్.. ఇప్పుడు సడెన్‌గా షూటింగ్ ఆపేసి మరీ చెకప్ కోసం ఫారెన్ బయల్దేరారు. రజినీ అంత హడావిడిగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ ఫారెన్ వెళ్తున్నారంటే.. ఏదో ఉందని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్.

కంగారుపడాల్సిన విషయమేమీ లేదని, యాన్యువల్ హెల్త్ చెకప్ కోసమే సూపర్‌స్టార్ అమెరికా వెళ్లారని సన్నిహితులు చెప్పడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం రజినీ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు.

Rajinikanth

 

అక్కడ తనను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు తలైవా. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజినీ ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న తన పోర్షన్ షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్ చేసేశారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.