Rajini Kanth
Rajinikanth: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఒక్క ఇండియాలోనే కాదు.. జపాన్, మలేషియా లాంటి ప్రాంతాల్లో కూడా తన సినిమాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఎంత మార్కెట్ ఉంటుందో? అంతే మార్కెట్ జపాన్‍లో ఉంటుంది రజినీకాంత్‌కి. ముత్తు సినిమాతో జపాన్‌లో సూపర్ హిట్ అందుకున్న రజినీకాంత్.. ఇప్పుడు మరోసారి దర్భార్ సినిమాతో క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
తలైవా రజినీకాంత్ నటించిన దర్భార్ సినిమా జపాన్‌లో అద్భుతమైన విషయం సాధించింది. భారత్‌లో పొంగల్ కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ అయిన “దర్బార్” మూవీ జపాన్‌లో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇటీవల జపాన్‌లో ప్రదర్శించగా.. అద్భుతమైన స్పందన వస్తోందని చెబుతున్నారు. ఈ చిత్రం జపనీస్ వెర్షన్ జపాన్‌లోని ఎంకేసి ప్లెక్స్‌లో విడుదలైంది. ఈ నెల 21 వరకు అక్కడి థియేటర్లలో ‘దర్భార్’ ప్రదర్శితం కానుంది. దర్భార్ సినిమా భారత్‌లో యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా జపాన్‌లో మాత్రం అధ్భుతమైన రెస్పాన్స్‌తో సూపర్ హిట్ అయ్యింది.
‘దర్బార్’లో రజినీకాంత్ తో పాటు నయనతార, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ప్రస్తుతం రజినీకాంత్ “అన్నాత్తే” సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ సిరుతై శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Darbar Flop Dawww ???
Beat his stardom if you can !!! ? #Rajinikanth #Thalaivar #DarbarThiruvizhaJapan #Darbar #Annaatthe #SuperstarRajinikanth @rajinikanth pic.twitter.com/favzlxnA3K— Rajini Army (@rajiniarmy_offl) July 17, 2021