Rajinikanth: ప్లాప్ దర్శకుడితో సూపర్ స్టార్.. అంత నమ్మకం ఏంటి ‘పెద్దన్నా’?
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో ఇప్పుడు ఉచ్చదశలో ఉన్నారు. సౌత్ సూపర్ స్టార్ గా కెరీర్ లో ఎన్నో శిఖరాలను చూసేసిన ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలతో అభిమానులను మెప్పించాలో..
- Naresh Mannam
- Published On : December 15, 2021 / 02:50 PM IST
Annaatthe
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో ఇప్పుడు ఉచ్చదశలో ఉన్నారు. సౌత్ సూపర్ స్టార్ గా కెరీర్ లో ఎన్నో శిఖరాలను చూసేసిన ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలతో అభిమానులను మెప్పించాలో అర్ధంకాని దశలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. రోబో లాంటి సినిమాతో ఇండియన్ సినిమాను తనవైపుకు తిప్పుకున్న ఆయనకు ఇప్పుడు తన రేంజ్ సినిమాలిచ్చే దర్శకులు దొరకడం లేదేమో అనిపిస్తుంది. ఆయన స్థాయికి తగిన కథలను కాకుండా వాళ్ళకి నచ్చిన కథలలో ఆయన ఇరికించేస్తున్నారా అనిపిస్తుంది.
Rashmika Mandanna : ‘పుష్ప’ కోసం చీర కట్టిన శ్రీవల్లి
ఇదంతా మొన్న తెలుగులో వచ్చిన పెద్దన్న సినిమా సమయంలో మన సినీ విశ్లేషకులు అనుకున్న మాటలే. దీపావళి కానుకగా విడుదలైన అన్నాత్తై సినిమా కోలీవుడ్ లో పర్వాలేదనిపించినా మన దగ్గర అనుకున్న స్థాయి విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ సమయంలో మంచి స్కోప్ ఉన్నా సోసో వసూళ్లతో సరిపెట్టుకుంది. తమిళనాట రజనీ స్థాయి వేరు కనుక అక్కడ పర్వాలేదనిపించే వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాపై దర్శకుడిపైనే విమర్శలు వినిపించాయి. నాలుగు దశాబ్దాల కిందటి కథతో పరమ రొటీన్ సినిమా తీశాడని ఏకిపారేశారు.
Balakrishna : ‘అఖండ’ విజయోత్సవ ర్యాలీలో బాలయ్య
పెద్దన్న సినిమాతో ప్లాప్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న శివకి మరో ఛాన్స్ ఇచ్చి రజనీకాంత్ మంచి మనసు చాటుకున్నాడని ఇప్పుడు కోలీవుడ్ టాక్. రజినీ 169వ సినిమాగా మొదలుకానున్న ఈ సినిమాకి దర్శకుడు శివ కాగా పెద్దన్న సినిమాని నిర్మించిన సన్ పిక్చర్స్ వారే ఇది కూడా నిర్మించనున్నారట. అయితే ఈసారి యూనివర్సల్ కథతో ఈ సినిమా ఉండనుందని చెప్తున్నారు. నిజానికి శివ పెద్దన్నతో ప్లాప్ అయినా వీరం, వేదాళం, వివేగం లాంటి సూపర్ హిట్స్ ఆయనవే. మరి ఈసారి రజని కొత్త సినిమాని ఎలా తీస్తాడో చూడాలి.
