supreme court counter to vijay sethupathi in a case
Vijay Sethupathi : తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్నాడు. ఒకపక్క హీరోగా చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, గెస్ట్ అప్పీరెన్స్ లతో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. ఇక తమిళ్ లోనే కాక తన నటనతో వేరే రాష్ట్రాల్లో కూడా అభిమానులని సంపాదించుకున్నాడు మక్కల్ సెల్వన్.
విజయ్ సేతుపతి గతంలో ఓ వివాదంలో పడగా అది ఇంకా కోర్టులో సాగుతుంది. 2021లో విజయ్ సేతుపతి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. అప్పట్లో ఈ గొడవ వైరల్ గా మారింది. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తి విజయ్ సేతుపతి, అతని మనుషులు తనపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో తనని దూషించారని ఆరోపిస్తూ గతంలోనే సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసు అప్పట్నుంచి నడుస్తూనే ఉంది.
RC15 shooting Leaks : RC15కు ఆగని లీకుల బెడద.. ఏం చెయ్యాలో తెలియక దిల్ రాజు..
తాజాగా సుప్రీం కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టి విజయ్ సేతుపతిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. మీరు సెలబ్రిటీ, అది మర్చిపోకండి. సెలబ్రిటీలు జనాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రజలతో విభేదాలు పెట్టుకొని వారి మధ్య తిరగలేరు అని కోర్టు విజయ్ సేతుపతిని హెచ్చరించింది. అలాగే తదుపరి విచారణని మార్చ్ 2కు వాయిదా వేసి.. ఈ లోపు అతనితో మాట్లాడి చర్చల ద్వారా గొడవ పరిష్కరించుకోవాలని కోర్టు ఆదేశించింది. మరి దీనిపై విజయ్ సేతుపతి ఏమని స్పందిస్తాడో చూడాలి.