×
Ad

Supritha : వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి.. అలాంటి కామెంట్స్ చేసేవాళ్లపై సుప్రీత ఫైర్..

దీనిపై సుప్రీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఫైర్ అయింది. (Supritha)

Supritha

Supritha : నటి సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా, పలు షోలతో ఇప్పటికే ఫేమ్ తెచ్చుకుంది. సుప్రీత హీరోయిన్ గా అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. సుప్రీత విదేశాలకు, గోవాకు ట్రిప్స్ వేస్తూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ చేసేది.(Supritha)

దీంతో పలువురు నెటిజన్స్ వీళ్ళకు ట్రిప్స్ కి డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఇన్ని ట్రిప్స్ ఎలా వేస్తున్నారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సుప్రీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఫైర్ అయింది.

Also Read : Supritha : అమ్మ మీద డ్రగ్స్, నా మీద బెట్టింగ్ యాప్స్ ఆరోపణలు.. అమ్మకు ఏమైనా అయితే.. ఎమోషనల్ అయిన సుప్రీత..

సుప్రీత మాట్లాడుతూ.. మా మీద నెగిటివిటి ఎందుకో తెలీదు. సెలబ్రిటీల మీద నెగిటివిటి చూపిస్తారు. మేము డబ్బులు సంపాదించుకొని మేము ట్రిప్స్ కి వెళ్తే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతారు. నేను ఐటి రిటర్న్స్ కూడా వేస్తాను. మేము వెళ్లి లక్షలు లక్షలు ఖర్చుపెట్టము. మేము సంపాదించే దాంట్లో కొంత ట్రావెలింగ్ లో ఖర్చుపెడతాము. సాఫ్ట్ వేర్ వాళ్ళు కూడా వెళ్తారు. చాలా మంది వెళ్తారు కానీ మా మీదే ఎందుకు ఎక్కువ ఫోకస్ ఎందుకు అని అర్ధం కాదు.

నేను, మా అమ్మ వర్క్ చేస్తున్నాం. మా అమ్మ ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంది. కోట్లు ఆస్తులు లేకపోయినా బాగానే సంపాదించింది. జనాలకు వాళ్ళ ఊహలు ఏంటో తెలీదు. కానీ నేను వాళ్లకు ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఇలాంటి కామెంట్స్ అన్ని చూసే నేను ట్రావెలింగ్ చేసినా సోషల్ మీడియాలో పెట్టట్లేదు ఈ మధ్య. నేను ఆన్సర్ చెప్పాల్సింది మా అమ్మకు, నా అనుకున్న వాళ్లకు. వాళ్ళు వేలు ఎత్తి చూపించనంతవరకు బయటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దీని వల్ల నేను ఏడ్చాను కూడా ఎందుకు ఇలా అంటున్నారు అని. ఖాళీగా కూర్చొని కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. నేను పని చేసుకోవాలి కాబట్టి పట్టించుకోవడం మానేశా అని తెలిపింది.

Also See : Anasuya Bharadwaj : హెయిర్ కట్ చేసి కొత్త హెయిర్ స్టైల్ తో అనసూయ.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..