Supritha Surekhavani : తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి బిగ్ బాస్ లోకి.. సుప్రీత ఏం చెప్పిందంటే..
సుప్రీత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. (Supritha Surekhavani)
- Saketh U
- Published On : February 8, 2026 / 02:00 PM IST
Supritha Surekhavani
Supritha Surekhavani : సీనియర్ నటి సురేఖవాణి గత కొంతకాలంగా సినిమాల్లో కనపడట్లేదు. ఆమె కూతురు సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాతో, పలు షోలతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది సుప్రీత. ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా అమరావతికి ఆహ్వానం ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుప్రీత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సుప్రీత మాట్లాడుతూ.. నాకు బిగ్ బాస్ చూడటం అంటే చాలా ఇష్టం. మొదటి సీజన్ నుంచి రీసెంట్ 9వ సీజన్ వరకు అన్ని ఎపిసోడ్స్ చూసా. నాకు కూడా బిగ్ బాస్ లోకి రమ్మని కాల్స్ వచ్చాయి. 7వ సీజన్ కి ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ వద్దన్నారు. నాకు చిన్నప్పట్నుంచి అటాచ్మెంట్స్ ఎక్కువ. అక్కడికి వెళ్తే అందర్నీ మిస్ అవుతాను అని వద్దన్నారు.
బిగ్ బాస్ 5వ సీజన్ లో నన్ను, అమ్మని కలిపి బిగ్ బాస్ కి రమ్మని అడిగారు. అమ్మకు OCD ఎక్కువ. అందుకే నో చెప్పింది. కానీ నాకు మాత్రం బిగ్ బాస్ చూడటం ఇష్టం. బిగ్ బాస్ కి ఇంకెప్పుడు వెళ్ళను కూడా. వెళ్దాం అనుకున్నా అది నాకు సెట్ అవ్వదు అనిపించిందని తెలిపింది. దీంతో సుప్రీత, సురేఖవాణి బిగ్ బాస్ లోకి వచ్చి అవకాశం లేదని క్లారిటీ ఇచ్చేసింది.
Also Read : YS Jagan : వైఎస్ జగన్ తో స్టార్ హీరోలు సూర్య, కార్తీ మీటింగ్.. సూర్యని హత్తుకున్న జగన్.. వీడియో వైరల్..
