Supritha : మూడు లవ్ బ్రేకప్స్.. ట్రామా అనుభవించా.. ఇప్పటికి మెడిసిన్స్ వాడుతున్నా.. పాపం సుప్రీత..

తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ బ్రేకప్ స్టోరీల గురించి చెప్పుకొచ్చింది సుప్రీత. (Supritha)

  • Published on- October 5, 2026 / 07:29 AM IST

Supritha

Supritha : సురేఖవాణి కూతురుగా అందరికి పరిచయం అయిన సుప్రీత ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది. త్వరలోనే హీరోయిన్ గా రాబోతుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ బ్రేకప్ స్టోరీల గురించి చెప్పుకొచ్చింది సుప్రీత.

Also Read : Supritha Surekhavani : మా అమ్మకు ఆఫర్స్ రావట్లేదు.. మాకు సొంతిల్లు కూడా లేదు.. తన ఆస్తి వివరాలు చెప్పిన సుప్రీత..

సుప్రీత మాట్లాడుతూ.. నాకు మూడు బ్రేకప్స్ అయ్యాయి. మొదటిది చిన్నప్పుడు క్రష్ లాంటిది. అది పెద్ద లెక్కలో లేదు. సెకండ్ లవ్ చాలా ట్రామా ఇచ్చింది. దాని వల్ల నాకు ప్యానిక్ టాక్స్ వచ్చాయి. జనాలు ఎక్కువ ఉంటే కంగారు పడతాను, ఇప్పటికి దానికి మెడిసిన్స్ వాడతాను. ఆల్మోస్ట్ ఒక రెండున్నర ఏళ్ళు ఉన్నాను ఆ రిలేషన్ లో. ఆ ట్రామా మూడో రిలేషన్ షిప్ లోకి కూడా వచ్చింది. మూడో రిలేషన్ షిప్ బాగుంది కానీ బ్రేకప్ జరిగిన విధానం నన్ను బాగా బాధ పెట్టింది. నేను మారినా కానీ అతను పొసెసివ్ నెస్. షూట్ లో ఎవరితో మాట్లాడుతున్నావ్, ఎందుకు అని అనుమానాలు ఉంటాయి. ఈగో ఎక్కువ. లవ్ లో బాగా హర్ట్ అయ్యాను.

ఆ బ్రేకప్ నాకు కెరీర్ మీద ఎఫెక్ట్ అయింది అందుకే నేను ఆ రిలేషన్ షిప్ నుంచి కూడా బయటకు వచ్చేసాను. ఈ బ్రేకప్స్ వల్ల ఎక్కువ ఏడవడం, ఓవర్ థింక్ చేయడం.. లాంటివి వచ్చాయి. వాటి నుంచి బయటకు రావాలనుకున్నా కానీ అప్పుడప్పుడు గుర్తు వస్తాయి. బ్రేకప్ వల్ల ఎఫెక్ట్ అయి బరువు తగ్గాను. 52 కేజీలకు తగ్గాను. హాస్పిటల్ పాలయ్యాను. సన్నగా అయ్యాను. అందరూ సన్నగా అయ్యావు అని తిట్టారు. ప్యానిక్ అటాక్స్, చెస్ట్ పెయిన్, చెమటలు వస్తాయి. హార్ట్ పట్టేసినట్టు ఉంటుంది. మెడిసిన్స్ వాడుతున్నా, మెడిటేషన్ చేస్తున్నా వాటి కోసం. ఈ రోజుల్లో ఎవరికీ ఓపిక, టైం లేదు. ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుందాం అనుకునేలా లేరు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఒకేలా ఉన్నారు అని తెలిపింది. దీంతో సుప్రీత లవ్ లో ఎంత బాధపడిందో పాపం అని కామెంట్స్ వస్తున్నాయి.

Also Read : Supritha : నాన్న చావుని వాడుకున్నావు అన్నారు.. నాన్న ఉండుంటే.. సుప్రీత ఎమోషనల్..