Surekha Vani : కూతురితో క‌లిసి సురేఖా వాణి ర‌చ్చ – వీడియో

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తన కూతురు సుప్రీతతో కలిసి డాన్స్ చేశారు. స్టైలిష్ దుస్తులు వేసుకొని డాన్స్ విరగదీశారు తల్లీకూతుర్లు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

Surekha Vani

Surekha Vani : సురేఖా వాణి.. సినీ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే.. వెండి తెరపై అనేక పాత్రాలు చేశారు సురేఖా, ఏ పాత్ర చేసిన దానికి తగిన న్యాయం చేస్తారు. అత్తగా, తల్లిగా, వదినగా నటించి మంచి పేరు సంపాదించింది. తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. ఇక కరోనా కాలంలో సినిమా స్కూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు వాణి.. ఈ నేపథ్యంలోనే అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు.

వర్కౌట్స్, డాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తుంటారు. కొన్ని సార్లు సురేఖాతోపాటు కూతురు కూడా ఆమెతో స్టెప్పులు వేస్తుంటారు. అయితే ఆగస్టు 8న సురేఖా జన్మదినం కావడంతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆమె కూతురు సుప్రితతో కలిసి స్టెప్పులేశారు. స్టైలిష్ డ్రెస్‌ల‌లో ఇద్ద‌రు చేసిన డ్యాన్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ముఖ్యంగా మోడ్ర‌న్ దుస్తుల‌లో సుప్రిత కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఈ అమ్మ‌డు రానున్న రోజుల‌లో వెండితెర ఎంట్రీ ఇవ్వనుంద‌ని ఈ మ‌ధ్య సురేఖా వాణి క్లారిటీఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇకపోతే తన పుట్టినరోజు సందర్భంగా సుప్రిత.. ‘వయసు పెరుగుతుంది అంటే నేను వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్నట్లు కాదు.. ఇంకా పర్ఫెక్ట్ అవుతున్నట్లు’ అంటూ లాజిక్ మాట్లాడింది.