Suresh Babu controlled Jubilee Hills traffic last night
Suresh Babu : హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జూబిలీహిల్స్ లోని ట్రాఫిక్ మల్లింపులు వాహనదారులను ముప్పతిప్పలు పెడుతుంది. ఒక మలుపు తీసుకోడానికి దాదాపు కిలోమీటర్ దూరం ప్రయాణించి తీసుకోవాల్సి వస్తుండడంతో సెలెబ్రెటీలు సైతం ఈ ట్రాఫిక్ మల్లింపులుపై సోషల్ మీడియా వేదికగా సైటర్లు వేస్తున్నారు.
Suresh Babu: నారప్ప తెచ్చే వసూళ్లు.. ఒక్క రూపాయి కూడా ముట్టుకోరట!
కాగా నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ సమయంలోనే అటు వైపుగా వెళుతున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్వయంగా కారు దిగి ట్రాఫిక్ ని క్లియర్ చేశాడు. పూర్తిగా బ్లాక్ అయిపోయిన ట్రాఫిక్ ని సూచనలు చేస్తూ మొత్తాన్ని క్లియర్ చేశాడు. అందరి వాహనదారులా తాను కూడా ట్రాఫిక్ పోలీస్ వారు వచ్చేదాకా ఎదురు చూడకుండా ఒక భాద్యత గల పౌరుడిలా ప్రవర్తించడంతో నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఒకప్పుడు పెద్ద సినిమాలను అందించిన సురేష్ ప్రొడక్షన్స్.. ప్రెజెంట్ చిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కానీ చిన్న సినిమాతో వచ్చిన పెద్ద విజయాన్ని అందుకుంటుంది.