Suriya 42 titled as Kanguva in all languages Disha Patani
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) తన 42వ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. తమిళ మాస్ డైరెక్టర్ శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా ఈ మూవీ టైటిల్ ని ఏప్రిల్ 16న అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ క్రేజీ అప్డేట్ ని ఇస్తూ ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Suriya42: సూర్య 42 మూవీ ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఆడియో కంపెనీ!
ఆ గ్లింప్స్ లో సూర్య ఒక కొండ నుంచి మరో కొండ మీదకి గుర్రంతో దూకుతుంటే తన వెనక వేల సైన్యం ఉన్న సీన్ కనిపిస్తుంది. ఇక సూర్య మొహానికి మాస్క్, విల్లు బాణాలు ధరించి ఉండగా తనని అనుసరిస్తూ ఒక కుక్క, గెద్ద ఉన్నాయి. ఇది మొత్తం చూస్తుంటే రాబిన్ హుడ్ తరహాలో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఒక టైటిల్ ‘కంగువ’ ని ఫిక్స్ చేశారు. 2024 మొదటి భాగంలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani) నటిస్తుంది. 3D లో ఆడియన్స్ ముందు రాబోతున్న ఈ చిత్రం మొత్తం 10 లాంగ్వేజ్స్ లో రిలీజ్ కాబోతుంది. తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్, టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఒక సంచలన స్టేట్‌మెంటే ఇచ్చాడు. ఈ చిత్రంతో బాహుబలి, KGF లాంటి సినిమాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం ఇస్తాం అంటూ పేర్కొన్నాడు. మరి ఈ చిత్రం ఎటువంటి విజయం సాదిస్తుందో చూడాలి.