Suriya : పాలిటిక్స్ లోకి ఎంట్రీ పై స్పందించిన సూర్య.. రాజకీయాలు గమనిస్తున్నాను అంటూ..

వరుసగా మూడు సినిమాలతో హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సాధించాడు సూర్య. (Suriya)

  • Published on- November 9, 2026 / 02:07 PM IST

Suriya

Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇటీవలే సీన్ సినిమాతో వచ్చి విజయం సాధించాడు. కరుప్పు, విశ్వనాధ్ & సన్స్, సీన్.. ఇలా వరుసగా మూడు సినిమాలతో హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సాధించాడు.

ఇటీవల తమిళ హీరోలు, నటీనటులు చాలా మంది రాజకీయాల బాట పట్టారు. తమిళనాడులో ఎప్పట్నుంచో చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాలను శాసించారు. ఇటీవల విజయ్ సీఎం అవ్వడంతో మరింతమందికి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విశాల్, లారెన్స్, ధనుష్.. ఇలా చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారని. సూర్య కూడా స్టార్ డమ్ తెచ్చుకోవడంతో పాటు అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. దీంతో సూర్య కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారేమో అని చర్చ మొదలైంది.

Also See : Vijay-Rashmika : జ‌పాన్ వెకేష‌న్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌.. ఫ్యామిలీతో.. ఫోటోలు వైర‌ల్‌..

తాజాగా సీన్ సినిమా ప్రమోషన్స్ లో సూర్యకు రాజకీయాల గురించి ప్రశ్న ఎదురైంది. దాంతో సూర్య స్పందిస్తూ.. నేను రాజకీయాల్లోకి రావట్లేదు. అలా అని రాజకీయాలంటే నాకు ద్వేషం లేదు. కానీ నేను రాజకీయాలను నిశ్శబ్దంగా గమనిస్తున్నాను. యువత రాజకీయాలపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. రాజకీయ నాయకులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పూర్తి అంకితభావంతో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. నాకు సరైన మార్గం తెలియకపోయినా నేను రాజకీయాల్లోకి మాత్రం రాను అని అన్నారు. దీంతో సూర్య రాజకీయాల్లోకి రాను అని క్లారిటీ ఇచ్చేసారు.