Kanguva : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే..

Suriya Kanguva movie pre release event date fix

Kanguva : పాన్ ఇండియా స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా కంగువా. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేసారు మేకర్స్.

Also Read : Alia Bhatt : నా కూతురు పబ్లిక్ ఫిగర్ అవ్వడం నాకు ఇష్టం లేదు.. ఆలియా షాకింగ్ కామెంట్స్..

అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. నవంబర్ 7న సాయంత్రం 6గంటలకి ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగులో హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. కాగా ఈ ఈవెంట్ కి హీరో సూర్యతో పాటు చిత్ర బృందం హాజరు కానుంది.

ఇక ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. సూర్య సరసన ఇందులో దిశా పఠానీ కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతిబాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలకపాత్రలో నటించారు.