Alia Bhatt : నా కూతురు పబ్లిక్ ఫిగర్ అవ్వడం నాకు ఇష్టం లేదు.. ఆలియా షాకింగ్ కామెంట్స్..

Alia Bhatt : నా కూతురు పబ్లిక్ ఫిగర్ అవ్వడం నాకు ఇష్టం లేదు.. ఆలియా షాకింగ్ కామెంట్స్..

I dont want my daughter to become a public figure Alia shocking comments

Updated On : November 6, 2024 / 1:28 PM IST

Alia Bhatt : బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ గురించి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ జంటకి నవంబర్ 6, 2022లో పాప జన్మించింది. తన పేరు రాహా కపూర్. అయితే ఈ జంటకి పాప పుట్టినప్పుడే అంత త్వరగా పాపని పబ్లిక్ కి చూపించకూడదని ఫిక్స్ అయ్యారు.

అయితే ఈ విషయం గురించి ఆలియా గతంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నిజానికి రాహా పుట్టినప్పుడు తనని సోషల్ మీడియాకి అంత త్వరగా పరిచయం చేయొద్దు అనుకున్నాను. కానీ ఊహించని విధంగా రాహా మేము అనుకున్న దానికంటే ముందే ప్రజలకి దగ్గరైంది. ఈ విషయంలో నేను రణబీర్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాము. దానికి తగ్గట్టుగానే రాహా ఫోటోలను కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూపించలేదు. తన మీద మీరందరు చూపుతున్న ప్రేమకి చాలా సంతోషంగా ఉంది. నిజానికి రాహా పబ్లిక్ ఫిగర్ అవ్వడంతో నేను చాలా ఫీల్ అయ్యానని, అంతే కాదు ఇప్పుడు కూడా ఈ విషయంలో నేను కంఫర్ట్ గా లేనని తెలిపింది.

Also Read : Chiranjeevi : 20 ఏళ్ళ క్రితం చిరంజీవి తాగిన టీ కప్పు.. ఇంకా దాచుకున్న కమెడియన్.. లక్ష రూపాయలు ఇచ్చినా ఇవ్వను..

ఇక ఆలియా, రణబీర్ కపూర్ ల చిన్నారికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతూనే ఉంటాయి. ఆలియా, రణబీర్ తన ఫోటోలు షేర్ చేయ్యనప్పటికీ అవి బయటికి వస్తుంటాయి. ఈ విషయం నచ్చకే ఆలియా అలా చెప్పింది.