Chiranjeevi : 20 ఏళ్ళ క్రితం చిరంజీవి తాగిన టీ కప్పు.. ఇంకా దాచుకున్న కమెడియన్.. లక్ష రూపాయలు ఇచ్చినా ఇవ్వను..
ఓ టీ కప్పుని చూపించాడు శివారెడ్డి. ఈ టీ కప్పు గురించి పెద్ద చరిత్రే చెప్పాడు.

Comedian Shiva Reddy Says history about a Tea cup from Megastar Chiranjeevi
Chiranjeevi – Shiva Reddy : కొంతమంది సెలబ్రిటీల వస్తువులు, ఫొటోలు, సెలబ్రిటీల దగ్గర్నుంచి అందుకున్న జ్ఞాపికలు లేదా ఇష్టమైన వాటిని ఎన్నేళ్ళైనా దాచుకుంటారు. అయితే ఓ కమెడియన్ ఏకంగా ఓ టీ కప్పుని 20 ఏళ్లకు పైగా దాచుకున్నాడు. మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శివా రెడ్డి ఆ తర్వాత కమెడియన్ గా అనేక సినిమాల్లో నటించాడు. శివారెడ్డి మెగాస్టార్ కు వీరాభిమాని అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. చిరంజీవి కూడా పలు మార్లు శివారెడ్డిని అభినందించారు.
Also Read : Allu Sneha Reddy : తిరుమలలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి.. ఫోటోల కోసం ఎగబడ్డ జనాలు.. వీడియో వైరల్..
తాజాగా శివారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కు తన హోమ్ టూర్ వీడియో ఇవ్వగా అందులో తనకు వచ్చిన అవార్డులు, జ్ఞాపికలు చూపించాడు. ఈ క్రమంలో ఓ టీ కప్పుని చూపించాడు శివారెడ్డి. ఈ టీ కప్పు గురించి పెద్ద చరిత్రే చెప్పాడు. శివారెడ్డి ఆ టీ కప్పు గురించి చెప్తూ.. అది మెగాస్టార్ చిరంజీవి గారు టీ తాగిన కప్పు. ఆ రోజు ఆయన టీ సగం తాగాక మిగిలిన సగం రిక్వెస్ట్ చేసి తీసుకొని నేను తాగాను. ఆ కప్పుని అడిగి తెచ్చుకున్నాను. ఈ కప్పును ఇరవై ఏళ్ళ క్రితం నుంచి దాస్తున్నాను. ఈ కప్పులో ఒక స్టార్ పెట్టాను. ఎందుకంటే ఇది మెగాస్టార్ కప్పు కాబట్టి అని తెలిపాడు.
Laksha rupailu ichina TEA cup ivvanu 😛🙏🏻
MEGASTAR @KChiruTweets meeda abhimanam 😍😎😍
20yrs to the TEA cup 😜#MegastarChiranjeevi#ActorShivaReddy#RoshanInterviews#SumanTv pic.twitter.com/Tee0oDgApK
— chinna for chiru (@chirucharanno1) November 6, 2024
అయితే యాంకర్ సరదాగా ఆ కప్పుని మేము తీసుకెళ్తామని అనగా శివారెడ్డి.. లక్ష రూపాయలు ఇచ్చినా ఇవ్వను అని అన్నారు. దీంతో మెగాస్టార్ అంటే అభిమానం పీక్స్ లో ఉందిగా, ఏకంగా 20 ఏళ్లుగా అది కూడా చిరంజీవి తాగిన టీ కప్పుని దాచుకోవడం గ్రేట్ అంటూ పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మెగాస్టార్ టీ కప్పు వీడియో వైరల్ గా మారింది.