Kanguva : సూర్య ‘కంగువ’ సెకండ్ లుక్ వచ్చేసింది.. మూడు కాలాల్లో సూర్య..

ఇప్పటికే కంగువ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజవ్వగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.

Suriya Kanguva Movie Second Look Poster Released

Kanguva Second Look : తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya), మాస్ డైరెక్టర్ శివ కంబినేషనల్ లో భారీగా తెరకెక్కుతున్న సినిమా ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో బాలీవుడ్ భామ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, మన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే కంగువ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజవ్వగా అవి వైరల్ అయ్యాయి. ఇందులో సూర్య చాలా వైల్డ్ లుక్స్ తో భయపెడుతున్నాడు. ఈ సినిమాలో సూర్య అయిదు పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని 10 భాషల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో కంగువ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.

Also Read : Samantha : సమంత సంక్రాంతి సోలో సెలబ్రేషన్స్ చూశారా? ఇంట్లో ముగ్గేసుకొని గాలిపటం ఎగరేస్తూ..

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రెండు పాత్రల్లో సూర్య కనిపిస్తున్నాడు. భవిష్యత్తు, వర్తమానం పాత్రల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టర్ ని షేర్ చేసి.. డెస్టినీ అనేది టైం కంటే కూడా బలమైంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు చిత్రయూనిట్. దీంతో సూర్య కంగువ కొత్త పోస్టర్ వైరల్ గా మారింది. ఈ సినిమాని 2024 సమ్మర్ తర్వాత రిలీజ్ చేయొచ్చని సమాచారం.