Karuppu : సూర్య ‘క‌రుప్పు’ టీజ‌ర్.. అదిరిపోయింది..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టిస్తున్న చిత్రం క‌రుప్పు.

Suriya Karuppu Teaser out now

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టిస్తున్న చిత్రం క‌రుప్పు. ఆర్జే బాలాజీ దర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. త్రిష క‌థానాయిక‌. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యోగిబాబు, శ‌శివాడ‌, న‌ట్టి సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

కాగా.. నేడు (జూలై 23) హీరో సూర్య పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు చిత్ర బృందం శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. అదే క్ర‌మంలో క‌రుప్పు టీజ‌ర్‌ను విడుద‌ల చేసి సూర్య ఫ్యాన్స్ బ‌ర్త్‌డే ట్రీట్ ఇచ్చింది. ‘కొబ్బ‌రి కాయ కొట్టి క‌ర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మ‌న‌సులో మొక్కుకుని మిర‌ప‌కాయ‌లు దంచితే రుద్రుడై దిగి వ‌చ్చే దేవుడు..’ అనే వాయిస్ ఓవ‌ర్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది.

OG : ప‌వ‌న్ ‘ఓజీ’ ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేది అప్పుడేనా?

“నా పేరు సూర్య‌.. నాకు ఇంకో పేరు ఉంది”, ‘ఇది నా టైమ్ అంటూ.. ‘అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్‌ అదిరిపోయింది. యాక్ష‌న్స్ సీక్వెన్ బాగున్నాయి. మొత్తంగా ఒక నిమిషం 42 సెక‌న్లు ఉన్న ఈ టీజ‌ర్ ఆకట్టుకుంటోంది.