OG : పవన్ ‘ఓజీ’ ఫస్ట్ సాంగ్ వచ్చేది అప్పుడేనా?
ఓజీ ఫస్ట్ సింగిల్‌పై ఫ్యాన్స్‌లో హైప్ ఆకాశాన్ని తాకుతోంది.

Pawan Kalyan OG Movie 1st Song
ఓజీ ఫస్ట్ సింగిల్‌పై ఫ్యాన్స్‌లో హైప్ ఆకాశాన్ని తాకుతోంది. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం నుంచి మొదటి సాంగ్ ఆగస్ట్ మొదటి వారంలో రిలీజ్ కానుందని టాక్. థమన్ మ్యూజిక్, శింబు గాత్రంతో రూపొందిన సాంగ్ ఫైర్ స్టోర్మ్ అనే టైటిల్‌తో ఉంటుందని, ఇది థమన్ కెరీర్‌లోనే బెస్ట్ ట్రాక్‌లలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
ఈ స్పెషల్ సాంగ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్‌పై ఆసక్తికర గాసిప్ ఒకటి తెరపైకి వచ్చింది. పవన్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, ఈ సాంగ్ రిలీజ్‌తో పాటు సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకోనున్నాయని టాక్.
ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక రౌడీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారట. ఈ సాంగ్ పవన్ పాత్రకు పరిచయంగా ఉంటుందని ఇన్‌సైడ్ టాక్. దసరా సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, ఏపీలో పరిస్థితులను బట్టి ఆగస్ట్‌లోనే సాంగ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.
ఇక సినిమా గురించి మరో గాసిప్ ఏంటంటే, ఈ సాంగ్‌లో పవన్ స్టైలిష్ లుక్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా హైలైట్‌గా ఉంటాయని చెప్తున్నారు. సుజీత్ ఈ చిత్రంలో జపనీస్ టచ్‌ని జోడించినట్లు చెబుతున్నారు. ఇది పవన్ స్వాగ్‌కి తగ్గట్టుగా ఉంటుందని టాక్. థమన్ మ్యూజిక్ ఆల్బమ్ మొత్తం వేరే లెవెల్‌లో ఉంటుందని, ఈ సాంగ్ విడుదలతో ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ గ్యారెంటీ అని మేకర్స్ లీక్ ఇస్తున్నారు. 2025 సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఓజీలో ఈ సాంగ్ ఒక బిగ్ ట్రీట్‌గా ఉండబోతుందట. ఓజీ ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.