Scene Pre Release Event : సూర్య ‘సీన్’ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? ఫుల్ డీటెయిల్స్..

ఇప్పటికే ఈ సంవత్సరం సూర్య కరుప్పు, విశ్వనాధ్ & సన్స్ సినిమాలతో హిట్స్ కొట్టాడు. (Scene Pre Release Event)

  • Published on- November 1, 2026 / 05:26 PM IST

Scene Pre Release Event

Scene Pre Release Event : తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజవుతాయని తెలిసిందే. ఇక్కడ కూడా సూర్యకి మంచి మార్కెట్, భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే విశ్వనాథన్ & సన్స్ సినిమాతో తమిళ్ కంటే తెలుగులోనే పెద్ద హిట్ కొట్టారు సూర్య. ఇప్పుడు సీన్ సినిమాతో రాబోతున్నారు. తమిళ్ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నజ్రియా హీరోయిన్ గా ప్రేమలు ఫేమ్,మలయాళం స్టార్ నస్లేన్ విలన్ గా సీన్ సినిమా తెరకెక్కింది.

సీన్ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తమిళ్ లో భారీ ఈవెంట్ నిర్వహించగా తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సూర్య సీన్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 2 సోమవారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో జరగనుంది. దీంతో ఈ ఈవెంట్ కి భారీగా తెలుగు సూర్య ఫ్యాన్స్ హాజరు కాబోతున్నారు.

Also Read : Rishikanth : రామ్ చరణ్ సినిమాలో తమిళ హీరో..? రీసెంట్ ‘డొరొతీ’ సెన్సేషన్.. RC17 పూజ కార్యక్రమంలో రిషికాంత్..

ఇప్పటికే ఈ సంవత్సరం సూర్య కరుప్పు, విశ్వనాధ్ & సన్స్ సినిమాలతో హిట్స్ కొట్టాడు. ఇప్పుడు సీన్ తో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నాడు.

Suriya