Vishwanath And Sons Collections : బాక్సాఫీస్ వద్ద సూర్య జోరు.. 200 కోట్ల క్లబ్‌లో విశ్వనాథ్ అండ్ సన్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం (Vishwanath And Sons Collections ) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
- Thota Vamshi Kumar
- Published on- August 23, 2026 / 09:41 PM IST
Suriya Vishwanath And Sons enter into 200 crore club
Vishwanath And Sons Collections : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మమిత బైజు కథానాయికగా నటించిన చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
చాన్నాళ్ల తరువాత సూర్య ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో రావడం, మమిత తన కామెడీ టైమింగ్ తో నవ్వించడం, మదర్ ఎమోషన్ తో ఏడిపించడంతో ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబడుతోంది.
Sravanthi Chokarapu : మత్తెక్కించే కళ్లతో యాంకర్ స్రవంతి.. అదిరిపోయే ఫోటోలు..
ఇప్పటి వరకు ఈ చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. దీంతో సూర్య ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
200 CRORES+ Worldwide Gross ❤️❤️
And still counting 🫶🏻🫶🏻#VishwanathAndSons continues its phenomenal run with families coming together and celebrating every emotion on the BIG SCREENS ❤️🔥#BlockbusterVAS#BlockbusterVishwanathAndSons@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju… pic.twitter.com/hYciSSKTND— Sithara Entertainments (@SitharaEnts) August 23, 2026
