Suriya42 Audio Rights Grabbed By This Popular Company
Suriya42: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య42’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఫిక్షనల్ కథగా రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రీలుక్ పోస్టర్స్‌తో వెల్లడించింది. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ యోధుడి పాత్రలో సూర్య తన నటనతో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.
Suriya42: సూర్య 42వ చిత్రం బిగ్ అప్డేట్.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్!
కాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈనెల 16న జరగనుందని చిత్ర యూనిట్ రీసెంట్‌గా వెల్లడించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఆడియో కంపెనీ SAREGAMA South భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా మూవీగా మాత్రమే కాకుండా, ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.
Suriya42 : టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన సూర్య..
ఈ సినిమాలో సూర్య లుక్స్ సరికొత్తగా ఉంటాయని.. ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా అత్యద్భుతంగా రాబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పటాని హీరోయిన్‌గా నటిస్తోండగా, పలువురు స్టార్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రెస్టీజియస్ స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
Let the Music of Victory and valiancy resonate with grandeur!
The audio rights of #Suriya42 acquired by @saregamasouth ?#Suriya42WithSaregama#Saregama
? A @ThisIsDSP Musical
✍️ @Viveka_Lyrics @madhankarky@Suriya_offl @DishPatani @directorsiva @StudioGreen2 @kegvraja pic.twitter.com/vlJVz08JYl— Studio Green (@StudioGreen2) April 15, 2023